NTV Telugu Site icon

Winter Weather: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు.. రానున్న మూడు రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత

Chali

Chali

Winter Weather: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్‌ జిల్లాలో రికార్డవుతున్నాయి. సిర్పూర్‌(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు.

Read Also: Constitution Day: నేడే భారత రాజ్యాంగ దినోత్సవం.. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన వేడుకలు

ఇక, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 8.8, ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 15.1, సూర్యాపేటలో 15.6, వనపర్తి డిస్ట్రిక్ లో 15.9 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగటానికి కారణమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడూ రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.

Read Also: Koti Deepotsavam Day -17: కన్నుల పండుగగా.. యాదగిరీశుని కల్యాణం, కీసరగుట్ట రామలింగేశ్వర కల్యాణం

కాగా, మిగిలిన 27 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ఠ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయగా.. చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయికి పడిపోతుంటాయి. కానీ, ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్‌లోనే చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. 10 ఏళ్లతో పోల్చితే ఈ నెల 23న రాత్రి నాలుగు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.

Show comments