సంగారెడ్డిలో నేడు తెలంగాణ జనసమితి పార్టీ రెండవ ప్లీనరీ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ వివిధ జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. భూమి ఇచ్చేవారి బతుకు బాగు పడాలని కోరుకుంటున్నామని, నీమ్జ్ ప్రాజెక్టు రాకూడదని రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళామన్నారు. సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలపై కూడా పోరాటం చేశామని, కాళేశ్వరం ఎత్తి పోత పథకం వల్ల వేల ఎకరాల పంట భూములు మునిగి పోతున్నాయన్నారు.…