KL University: NIRF ర్యాంకింగ్స్‌లో కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీ సత్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ (KL Deemed University) విద్యారంగంలో తన సత్తా చాటుకుంటోంది. ఇటీవల ప్రకటించిన NIRF ర్యాంకింగ్స్‌లో జాతీయ స్థాయిలో 27 వ ర్యాంక్ సాధించింది KL DEEMED యూనివర్సిటీ. భారత పరిశ్రమల సమాఖ్య నుంచి జాతీయ స్థాయిలో రెండు అవార్డులు పొందింది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల నాణ్యత ప్రమాణలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే నేషనల్ INSTITUTE ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ – ఎన్ ఐ ఆర్ ఎఫ్ లో కె ఎల్ DEEMED యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 27 వ ర్యాంక్ పొందినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ తెలిపారు. నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాబోధన, విద్యా ప్రణాళిక వంటి విషయాల్లోనే కాకుండా విద్యార్థుల కోసం మౌళిక వసతుల కల్పన, అత్యాధునిక పరిశోధనా కేంద్రాలు, గ్రంధాలయం అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
NIRF Rankings :ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. ఐఐటీ మద్రాస్‌దే మొదటి స్థానం
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
- Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
- Telangana Studies: వియత్నాం విద్యా మోడల్పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
అన్ని విభాగాల్లోనూ నాణ్యతా ప్రమాణాలను పాటించడం కోసం కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ఫలితంగానే తమ విద్యా సంస్థ అనేక విభాగాల్లో ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, జాతీయ అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలను పొందుతున్నారని ఆయన చెప్పారు.
యూనివర్సిటీ నిర్వహణ విషయంలో ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామన్నారు. నీటి నిర్వహణ, వ్యర్ధాల నిర్వహణ విషయంలో భారత పరిశ్రమల సమాఖ్య నుంచి జాతీయ స్థాయిలో 2, 3 ర్యాంక్ లను పొందినట్లు చెప్పారు. ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థుల ఆశయాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉత్తమ విద్యాసంస్థను అందిచటమే తమ లక్ష్యమని డాక్టర్ సారధివర్మ స్పష్టం చేశారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ప్రముఖ సంస్థలు ప్రకటించిన అనేక ర్యాంకింగ్ లలో జాతీయ స్థాయిలో 2, 3 ర్యాంకులను పొందామని, యూనివర్సిటీ అమలుచేస్తున్న విద్యా ప్రమాణాలు, సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమని అన్నారు.
తాజావార్తలు
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!