NTV Telugu Site icon

Kishan Reddy: యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్ పేటలో కిషన్ రెడ్డి పర్యటన

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి.కిషన్ రెడ్డి పర్యటించారు. యూసుఫ్‌ గూడ, జూబ్లీహిల్స్‌, అంబర్‌పేటలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేసి మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రకృతి వైపరీత్యాలను చురుగ్గా ఎదుర్కోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Read also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్ పేటలో కిషన్ రెడ్డి పర్యటించారు. అధికారులతో మాట్లాడి మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాభావ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేవలం హైటెక్ సిటీ, పరిసర ప్రాంతాలపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లోని పౌరసమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Etela Rajender: మాటలు గొప్పగా ఉంటాయి.. పరిహారం మాత్రం దిక్కు లేదు..