తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య విభేదాలు రచ్చ మీడియాకు ఎక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిపేందుకు సిద్ధమవుతున్న వేళ.. హైకోర్టు జోక్యంతో సద్ధుమణిగింది. దీంతో.. ప్రభుత్వం తరుఫున గవర్నర్‌ను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానించారు. దీంతో.. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినదే గవర్నర్ చదవారు. అయితే.. తాజాగా గవర్నర్ ప్రసంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని ఆయన ఆరోపించారు. కేంద్రం నిధులతో చేపట్టిన కార్యక్రమాలను తమ ఖాతాలో వేసుకున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లతోనే సరిపెడుతూ.. ఉద్యోగ కల్పనపై అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. అబద్ధాలు మాని తెలంగాణ ప్రగతిపై దృష్టిపెట్టండి ఆయన హితవు పలికారు.
Also Read : Covid-19: కోవిడ్ తర్వాత తీవ్ర మానసిక క్షోభకు గురువుతున్న హెల్త్ వర్కర్స్.. అధ్యయనంలో వెల్లడి..
అంతేకాకుండా.. ‘పాడుబడ్డ తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారాయని గవర్నర్ తో చదివించిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాభివృద్ధికి సర్పంచ్ లకు బిల్లులు ఇయ్యని విషయం మరిచిందా?. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దారిమళ్లించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడాన్ని బడ్జెట్ లో ప్రస్తావించి ఉంటే బాగుండేది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఈరోజు అనేక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సభ్యులు అవిశ్వాస తీర్మానాల కోసం అధికారులకు నోటీసులు ఇస్తున్న విషయం తెలంగాణ ప్రజలకు చాలా బాగా అర్థమవుతోంది. 2014-15లో రాష్ట్ర ఆదాయం 62 వేల కోట్లు ఉంటే, ప్రభుత్వ కృషితో 2021 నాటికి రూ. లక్ష 84 వేల కోట్లకు పెరిగిందని గవర్నర్ తో చెప్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. 16 వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దాదాపు 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన విషయాన్ని మరిచిపోయారా?’ అని ఆయన దుయ్యబట్టారు.
Also Read : Mahesh Kumar Goud : ఇంత అవమానాన్ని గురైన గవర్నర్ ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు