Kishan Reddy : PFC ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో నంబర్ వన్ తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఎఫ్‌సీ ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో నంబర్ వన్ తెలంగాణ అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ నేతలు ‘రిపోర్టు టూ పీపుల్’ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తూ.. మోడీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పవర్ పాయింట్ నిర్వహించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కిషన్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నాబార్డ్ ద్వారా రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో 5 వ స్థానమని, తిరిగి చెల్లించాల్సిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ అని ఆయన అన్నారు. ఆర్‌ఈసీ ద్వారా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ అని ఆయన వెల్లడించారు.
Also Read : Professional Email Tips: వృత్తిపరమైన ఈ-మెయిల్‌ను పంపేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు..
Also Read
వివిధ బ్యాంక్‌ల ద్వారా తీసుకున్న అప్పులు లక్ష 31 వేల కోట్లు అని, తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం, బ్యాంక్ ల ద్వారా వ్యక్తిగతంగా అందించిన రుణాలు 9 లక్షల 26 వేల కోట్లు అని కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ కూడా అప్పులు చేస్తుందని, తెలంగాణ పట్ల కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు. ప్రధాని అన్ని రాష్ట్రాలకు ప్రధాని అని, రాష్ట్రానికి ఏమిచ్చింది అనేది కాదు… రాష్ట్రంలో ఎంత ఖర్చు పెట్టింది అనేది ముఖ్యమన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Minister Venugopala Krishna: పవన్ పూటకో వేషం వేస్తున్నాడు.. మంత్రి వేణు ధ్వజం
తాజావార్తలు
-
LPG e-KYC: ఎల్పీజీ e-KYC గడువు ముగిసింది.. ఇప్పుడు ఏం చేయాలి? కనెక్షన్ రద్దవుతుందా? పూర్తి వివరాలు
-
Rammohan Naidu: ప్రపంచమే మన దగ్గర ఉన్న అనుభూతి.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
Dark Secrets OTT: ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు బోల్డ్ థ్రిల్లర్.. టాప్ 1 ట్రెండింగ్‌లో ‘డార్క్ సీక్రెట్స్’!
-
SL vs IND: 462 పరుగులకు భారత్ ఆలౌట్.. తొలి ఓవర్లోనే శ్రీలంకకు భారీ షాక్!
ట్రెండింగ్
-
iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!