పీఎఫ్‌సీ ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో నంబర్ వన్ తెలంగాణ అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ నేతలు ‘రిపోర్టు టూ పీపుల్’ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తూ.. మోడీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పవర్ పాయింట్ నిర్వహించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కిషన్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నాబార్డ్ ద్వారా రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో 5 వ స్థానమని, తిరిగి చెల్లించాల్సిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ అని ఆయన అన్నారు. ఆర్‌ఈసీ ద్వారా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ అని ఆయన వెల్లడించారు.
Also Read : Professional Email Tips: వృత్తిపరమైన ఈ-మెయిల్‌ను పంపేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు..
వివిధ బ్యాంక్‌ల ద్వారా తీసుకున్న అప్పులు లక్ష 31 వేల కోట్లు అని, తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం, బ్యాంక్ ల ద్వారా వ్యక్తిగతంగా అందించిన రుణాలు 9 లక్షల 26 వేల కోట్లు అని కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ కూడా అప్పులు చేస్తుందని, తెలంగాణ పట్ల కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు. ప్రధాని అన్ని రాష్ట్రాలకు ప్రధాని అని, రాష్ట్రానికి ఏమిచ్చింది అనేది కాదు… రాష్ట్రంలో ఎంత ఖర్చు పెట్టింది అనేది ముఖ్యమన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Minister Venugopala Krishna: పవన్ పూటకో వేషం వేస్తున్నాడు.. మంత్రి వేణు ధ్వజం
