Kishan Reddy: వరంగల్ జిల్లా మొరంచపల్లిలో వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని కేంద్ర మంత్రి బిజేపి రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించి భాదలను విన్నారు. అధిక వర్షాల వల్ల వరదలతో అనేక గ్రామాలు నీటమునిగాయని అన్నారు. ఇళ్ళు రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పంటపొలాలు వరదలో కొట్టుకుపోయాయని బాధితులు వాపోయారు. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల ఆదుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. జాతీయ విపత్తు క్రింద 800 నుంచి 900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిపారు. వాటితో బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. మృతులకు 4 లక్షల ఇచ్చే ఎక్సిగ్రేషియా లో 75 శాతం 3 లక్షలు కేంద్రం ఇచ్చినవే అని తెలిపారు. దానికి అదనంగా రాష్ట్రప్రభుత్వం ఇవ్వాలని కోరారు.
Read also: Bhadrachalam: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గిన గోదావరికి వరద..
కేంద్ర బృందాలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తాయని అన్నారు. క్లిష్టపరిస్థితిలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. బిజేపి బృందాలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిందన్నారు. దీంతో పలు జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని వివరించారు. పంటలు, జంతుజాలం దెబ్బతిన్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయన్నారు. మూడు రోజుల పాటు బీజేపీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటాయని కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని వరదల గురించి కేంద్ర హోంమంత్రి అమిత షాకు శనివారం వివరించినట్లు ఆయన తెలిపారు.
Hyderabad: తండ్రి మందలించాడు.. గాజు పెంకుతో గొంతు కోసిన కూతురు