Lok Sabha Results 2024: సికింద్రాబాద్ స్థానంలో కిషన్ రెడ్డి మళ్లీ తన సత్తా చాటుతున్నారు. కిషన్ రెడ్డికి ఇప్పటి వరకు 118818 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు 89472 ఓట్లు రాగా, బీఆర్ ఎస్ అభ్యర్థి పద్మారావుకు 31872 ఓట్లు వచ్చాయి. కిషన్ రెడ్డి 29346 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సికింద్రాబాద్ ఎంపీ సీటు బీజేపీకి కంచుకోట అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ అదే పునరావృతం కానుందని తెలుస్తోంది. కిషన్ రెడ్డి ఇప్పటికే ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన 3325 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కాగా.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలపై ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ ఒకటి. ఈసారి మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలోకి దిగారు. కేంద్రమంత్రి, సిట్టింగ్ ఎంపీ జి.కిషన్‌రెడ్డి బీజేపీ నుంచి, దాన నాగేందర్ కాంగ్రెస్ నుంచి, తీగుళ్ల పద్మారావు గౌడ్ బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. అంతేకాకుండా.. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగింది.