Kishan Reddy : ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం
- 8వ వేతన సవరణ సంఘానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
- ఉద్యోగుల సంక్షేమానికి మరో కీలక అడుగు
- మోదీ ప్రభుత్వ సంస్కరణల కొనసాగింపు
- 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ దిశగా కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయంపై కేంద్రమంత్రి జీ. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 8వ వేతన సవరణ సంఘం (8th Pay Revision Commission) విధివిధానాలను ఆమోదించినందుకు కేంద్ర కేబినెట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన స్పందించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నినాదం ఆధారంగా దేశంలోని ప్రతి వర్గం సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కృషికి సరైన గుర్తింపు ఇవ్వడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
వేతన సవరణతో ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉత్పాదకత పెరిగి ప్రజా సేవల నాణ్యత మరింత మెరుగవుతుందన్నారు. ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగుపడటం ద్వారా దేశీయ వినియోగం పెరిగి, ఆర్థిక వృద్ధికి కూడా ఊతమిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన పేర్కొంటూ – “మోదీ గారు నాయకత్వం వహించిన తర్వాత 2016లో 7వ వేతన సవరణ కమిషన్ ద్వారా ఉద్యోగులకు అనుకూలమైన సంస్కరణలు తీసుకువచ్చారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
2006లో జరిగిన 6వ పీఆర్సీలో కనీస వేతనం రూ.7 వేలుగా ఉండగా, 7వ పీఆర్సీలో దాన్ని రెండున్నర రెట్లు పెంచి రూ.18 వేలుగా నిర్ణయించారు. అంతేకాకుండా, కనీసం 3 శాతం ఇంక్రిమెంట్ తప్పనిసరిగా ఇవ్వాలనే నిర్ణయం కూడా మోదీ ప్రభుత్వంలోనే తీసుకున్నారు” అని గుర్తుచేశారు. ఇప్పుడు 8వ పీఆర్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరిన్ని మార్పులు తీసుకువచ్చిందని, ఈ నిర్ణయం ద్వారా 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకు పైగా పెన్షనర్లు లబ్ధి పొందనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి ద్విగుణీకృత ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.
Baahubali: The Epic: బాహుబలి రీ రిలీజ్ ప్రీమియర్.. జనం ఇంత కాళీగా ఉన్నారా?
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!