NTV Telugu Site icon

Kishan Reddy : ఎమ్మెల్యే, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయి

మరోసారి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మంత్రులపై విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కక్షపూరితమైన రాజకీయం నడుస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్ మీడియా పై నిర్బంధం పెరిగి పోయిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయని ఆయన ఆరోపించారు. రైస్, లిక్కర్, మైన్స్, సాండ్, ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని, మళ్ళీ గెలుస్తామో లేదో.. ఉన్నప్పుడు దోచుకుందామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తారన్నారన్నారు.

ఖమ్మం బీజేపీ కార్యకర్తపై 16 కేసులు పెట్టారు… మూడు సార్లు జైలుకి పంపించారు… పోలీసుల వేధింపులు నిత్య కృత్యం అయ్యాయని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో తేదీ తన పెళ్లి ఉందని… పెళ్లి పనులు చేసుకుంటున్నానని చెప్పిన పోలీసులు వినలేదని, దీంతో పోలీస్ స్టేషన్ ముందు విషం తీసుకున్నారన్నారు. తన ఆత్మహత్యకు కారణం ఏందో మీడియా ముందు తెలిపినా.. కేసు నమోదు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ పై కేసు పెట్టారు… కానీ కారణం అయిన వారి పై కేసు పెట్టలేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.