నిన్న టీఆర్‌ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… ప్లీనరీలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అబద్దాలు, అభూత కల్పనలు వెల్లడించారన్నారు. పూనకo వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, బీజేపీ అంటే భయపడుతున్నారన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణను ఏం ఉద్ధరించారని, పౌరుడిగా ఫ్రoట్ పెట్టొచ్చు, టెంట్ వేసుకోవచ్చునన్నారు. రాజ్యంగం ప్రకారం ఉన్నత పదవుల్లోకి రావచ్చునని ఆయన అన్నారు. గుణాత్మక పరిపాలన అంటే కల్వకుంట్ల పాలనా? గుణాత్మక పాలన అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పాలనా? గుణాత్మక పాలన అంటే తండ్రి కొడుకుల పాలనా? అని ఆయన ప్రశ్నలు సంధించారు.
అప్పులు చేసి కమిషన్లు కొల్ల గొడుతున్నారని, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఎక్కన్నుంచి వస్తున్నాయో చెప్పాలన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల పట్ల కేసీఆర్ కు అవగాహన లేదని, మోడీ ప్రధాని అయ్యాక విదేశాల్లో ఉన్న భారతీయులు తలెత్తుకుని తిరుగుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఏ దేశం చేయని సాహసం మోడీతో సాధ్యమైందన్నారు. యుద్దాన్ని ఆపించి 22 వేల మందిని వెనక్కి తీసుకు వచ్చారని ఆయన తెలిపారు.