Kishan Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవడమే బీజేపీ లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే… వ్యూహాలు రచించి ప్రజల్లోకి వెళుతున్నారు. దీంతో పాటు ఢిల్లీకి చెందిన అనుభవజ్ఞులు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీని పునరుద్ఘాటిస్తూ.. ఆ వర్గాన్ని కమలం పార్టీ ఆకర్షిస్తోంది. మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా అభ్యర్థులను మందలించింది. కానీ… పార్టీలో కొందరు ప్రముఖ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గైర్హాజరుపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పోటీ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీసీలను ముఖ్యమంత్రి చేయడమే తమ పార్టీ విధానమని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
ఈ నేపథ్యంలో తాను ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలకు, శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే తాను ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని కిషన్ రెడ్డి అన్నారు. 2009, 2014లో అంబర్‌పేట ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్‌రెడ్డి 2018లో కాలేరు వెంకటేశంపై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. తాజాగా పార్టీ అధిష్టానం ఆయనను మరోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. అయితే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని గెలిస్తే.. సీనియారిటీ ప్రకారం కిషన్ రెడ్డి సీఎం అభ్యర్థి అని అందరూ భావించారు. అయితే ఈసారి బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం అని పార్టీ అధిష్టానం ప్రకటించడంతో.. ఎలాగూ సీఎం అయ్యే అవకాశం లేకపోవడంతో కిషన్ రెడ్డి బరిలో నిలవకుండా పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది.
Rajasthan: రాజస్థాన్ లో రేపే పోలింగ్
తాజావార్తలు
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!