Site icon NTV Telugu

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఆత్మ ఘోషిస్తుంది

Kishanreddy

Kishanreddy

Kishan Reddy : తెలంగాణ బీజేపీ చీఫ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేరారు. ఆదివారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(State office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు.. కాషాయ పార్టీలో చేరిన ఖైరతాబాద్‌కు చెందిన పలువురికి పార్టీ కండువా కప్పి.. ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఆత్మ ఘోషిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీలో వీధిలైట్ల రిపేర్లకు 7 నెలల నుంచి నిధులు లేవని, లిక్కర్ సప్లై చేసిన కంపెనీలకు కూడా డబ్బులిచ్చే పరిస్థితి లేదనే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు. అవినీతి కేసుల నుంచి రక్షించుకునే పనిలో బీఆర్ఎస్ ఉందని, ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారన్నారు కిషన్ రెడ్డి.

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ని పొడిచింది బంగ్లాదేశ్ వ్యక్తి.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?

తెలంగాణలో అక్రమాలకు, అవినీతికి బీఆర్ఎస్, కాంగ్రెస్ లు కారణమని, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలన్నారు. అంతేకాకుండా.. భారత రాజ్యం మీద పోరాడలన్న రాహుల్ గాంధీకి సిగ్గు ఉండాలని, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు. ఆరు గ్యారంటీలు ఇచ్చిన తర్వాతే తెలంగాణకు రాహుల్ రావాలని, రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. పీవీ నర్సింహారావుని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కిషన్‌ రెడ్డి. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో వస్తుందని ఆయన వెల్లడించారు.

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో నకిలీ షేక్ హల్‌చల్.. చితకబాదిన సాధువులు (వీడియో)

Exit mobile version