Kishan Reddy : హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా సందర్భంగా నిర్వహించే “అలయ్ బలయ్” కార్యక్రమ ప్రాధాన్యతను గుర్తుచేశారు. విభేదాలు ఉన్న నాయకులు కూడా ఒకే వేదికపై కలుసుకునే ప్రత్యేక వేదిక ఇదేనని ఆయన పేర్కొన్నారు.
Akshay Kumar: నా కూతురు న్యూడ్ పిక్స్ అడిగాడు.. అక్షయ్ కుమార్ సంచలనం
“దసరా రోజున మనం ఒకరిని ఒకరు కలుసుకుని ఆశీర్వాదం తీసుకుంటాం. అదే తరహాలో అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా రాజకీయంగా విభేదించే వ్యక్తులు కూడా ఒకే వేదికపై కలుస్తారు,” అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా దత్తాత్రేయ గారు అలయ్ బలయ్ ద్వారా అందరినీ కలిపారని ఆయన గుర్తుచేశారు. మునుపు దేవాలయాలకు వృద్ధులు మాత్రమే వెళ్తారని, కానీ ఇప్పుడు పాఠశాల విద్యార్థులు కూడా ఆసక్తిగా దేవాలయాలకు వెళ్ళి చదువుకు బయలుదేరుతున్నారని చెప్పారు. సనాతన ధర్మంపై యువతకు ఆసక్తి పెరగడం సంతోషకరమని ఆయన అన్నారు.
ప్రపంచంలో ఎవరూ GST తగ్గించలేదని, కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం పేదలకు ఊరట కలిగించేలా అనేక వస్తువులపై GST తగ్గించారని కిషన్ రెడ్డి తెలిపారు. “ధరలు పెరగడమే తప్ప తగ్గవు అనేది సాధారణ అభిప్రాయం. కానీ మోడీ గారు ధరలు తగ్గించారు. దసరా, దీపావళి పండుగల సమయంలో పేదలకు నిజమైన గిఫ్ట్ ఇచ్చారు,” అని ఆయన అన్నారు. GST ద్వారా మోడీ నిజమైన “అలయ్ బలయ్” ఇచ్చారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాజకీయ విభేదాలు వేరుగా ఉన్నా, దేశానికి సంబంధించి అందరూ ఒకే దారిలో నడవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. “ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా మనం అలయ్ బలయ్ చేసుకున్నాం. దేశ ఏకతా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా నిలబడాలి. హిందూ మతం లేకుంటే దసరా ఉండదు, దేశ ఏకతా ఉండదు,” అని ఆయన అన్నారు.
Avatar 3: ‘అవతార్: స్నీక్ పీక్‌తో ‘ది వే ఆఫ్ వాటర్’ రీ-రిలీజ్
