Kidnapped Son: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తండ్రి కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన ఘటన వెలుగు చూసింది. ఈఘటన రాచకొండ కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా కాంప్లెక్స్ లోటస్ ల్యాబ్ స్కూల్లో చోటుచేసుకుంది. రెండు సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవ విడాకుల కేసు కోర్టు నడుస్తుండగా ఆరు నెలల నుండి భార్య సరూర్నగర్ లోని బంధువుల ఇంట్లో ఉండగా ఉదయం 8.30 గంటలకు తల్లి బాలుడిని లోటస్ ల్యాబ్ స్కూల్ వద్ద వదిలి వెళ్ళగా తండ్రి తోపాటు మరో ఇద్దరు కలిసి బాలుడిని స్కూల్ నుండి తీసుకెళ్లారు. అనంతరం స్కూల్ యాజమాన్యం తల్లికి సమాచారం అందించడంతో.. తల్లి సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్కూల్ యాజమాన్యం, తల్లి కేసు నమోదు చేసుకుని సరూర్నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read also: MLAs Resignation: నిన్న మెదక్ నేడు మంచిర్యాల… దివాకర్ రావ్ కు రాజీనామాల గోల
తల్లి మాట్లాడుతూ.. భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలు వున్నాయని దాని కారణంగానే విడాకుల కేసు కోర్టులో నడుస్తుందని అన్నారు. ఆరు నెలల నుండి తన బంధువుల ఇంట్లో ఉంటున్నట్లు తెలిపింది. తన కొడుకు కోసమే బతుకు తున్నానని, తన కొడుకుని తన వద్దకు చేర్పించాలని కోరింది. తన బొడ్డను సురక్షితంగా తనకు అప్పగించాలని పోలీసులను ప్రాధేయపడింది. కన్న తండ్రే కొడుకును కిడ్నాప్ చేశాడని ఆమె తెలిపింది. తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని సహకరించి వారిని కూడా పట్టుకునేందుకు బరిలో దిగారు. సీసీ ఫోటేజ్ ను పరిశీలించేందుకు, మరే ఇతర ఆధారాలను పరిశీలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Vangalapudi Anitha:న్యాయం అడిగితే కేసులు పెడుతున్నారు