Site icon NTV Telugu

Child Kidnapping: కిడ్నాప్ గురైన చిన్నారి సేఫ్‌.. ఏపీకి తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు

Kidnaping Ghatkeser

Kidnaping Ghatkeser

Child Kidnapping: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్‌లో బుధవారం రాత్రి కిడ్నాప్‌కు గురైన కిడ్నాపర్ కృష్ణవేణి క్షేమంగా ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో పోలీసులు చిన్నారిని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సురేష్‌ను గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. పసికందును ఇతర ప్రాంతాలకు విక్రయించేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారితో ఘట్ కేసర్ సీఐ మహేందర్ రెడ్డి తీసుకురానున్నారు. తర్వాత పాపను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్‌ స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మేడ్చల్ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటూ చిన్నారి కనిపించకుండా పోయింది. అన్ని చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అమ్మాయి పేరు కృష్ణవేణి అని తెలుస్తోంది. రాత్రి దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో మతిస్థిమితం లేని వ్యక్తి సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సురేష్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

Read also: Karumuri Nageshwara Rao: రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

రాత్రి 8 గంటల సమయంలో సురేష్ కిరాణా దుకాణం దగ్గరకు వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో పాప చాక్లెట్ కొనేందుకు వెళ్లింది. సురేశ్, పాపను తీసుకెళ్లడం చూసిన స్థానికులు పోలీసులకు తెలిపారు. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ పాపను ఏం చేశాడోనని ఆందోళన చెందారు. సురేష్ అనే వ్యక్తి రాత్రి 8.30 గంటల తర్వాత కృష్ణవేణిని తీసుకెళ్తున్న అనిల్ చూశాడు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సురేష్ గతంలో కాలేజీలో పనిచేస్తున్నప్పుడు, సినిమా థియేటర్‌లో పని చేస్తూ అమ్మాయిలను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఏపీకి తీసుకెళ్లేవాడని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపడంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు 15 గంటల్లో చిన్నారిని సురక్షితంగా రక్షించారు.
Rice Price: ఇప్పుడే కొనేయండి.. బియ్యం రేట్లు పెరగబోతున్నాయ్

Exit mobile version