NTV Telugu Site icon

Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు..

Seetharama Project

Seetharama Project

Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. అనంతరం పుసుగూడెం, కమలాపురం పంపుహౌస్లను మంత్రులు పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ 3 పంపు హౌస్లు ప్రారంభానికి సిద్ధంగా వున్నట్లు తెలిపారు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పంప్ హౌజ్ ల ప్రారంభోత్సవం రోజున ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల కేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

Read also: Pigeon Droppings: పావురంతో ప్రాణాంతక వ్యాధులు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..

సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ప్రతి ఎకరాకు నీరందించి సాగులోకి తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ అధికారులు పనులు వేగవంతం చేయాలని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ అనుమతులు తుది దశకు చేరుకున్నాయని, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు వద్దకు చేరాయని మంత్రి ఉత్తమ్ ప్రస్తావించారు. అదే సమయంలో సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల అనుమతులపై దృష్టి సారించి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. కాలువల నిర్మాణానికి అడ్డుగా ఉన్న రైల్వే క్రాసింగ్ ల వద్ద నిర్మాణాలు ఆగకుండా శాఖాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
Cough Medicine: దగ్గు మందులతో సైడ్ ఎఫెక్ట్స్..? షాకింగ్ నిజాలు..!