NTV Telugu Site icon

Renuka Chowdhury: ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయి.. ప్రతి పక్షాలపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్

Renuka Cowdari

Renuka Cowdari

Renuka Chowdhury: ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రతి పక్షాలపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాట్‌ కామెంట్‌ చేశారు. ఖమ్మం జిల్లాలో రెండు రోజులపాటు హరీష్ రావు పర్యటన నేపథ్యంలో రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు కుక్కిన పేనులా ఉన్న అజయ్ నేడు మీసాలు తిప్పుతున్నాడని అన్నారు. రైతులకు భేడీలు వేసిన వాళ్ళు ఇవ్వాళ మాట్లాడుతున్నారని తెలిపారు. దుష్టశక్తులు ఏవో మాట్లాడుతున్నారని అన్నారు. కార్తీక మాసంలో అపశకుణం మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ కు రబీకు తేడా తెలియని వారు మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు.

Read also: Telangana CMO: మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం.. దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్..

పోలీసులు లేకుండా జనాల్లోకి వచ్చినా మొహాలామీవి అని కీలక వ్యాఖ్యలు చేశారు. గుట్టలు మాయం చేసిన మీరా మాట్లాడేది అంటూ మండిపడ్డారు. కోయిన్ని వెంకన్నను అడిగితే మీ పాపాలు బయట పడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు ప్రజల మీద సానుభూతి ఉంటే సలహాలు సూచనలు చేయండి…. స్వీకరిస్తాం అన్నారు. రాష్ట్రం లో ఒక మాట దేశంలో ఒక మాట అంటూ మండిపడ్డారు. బిడ్డను జైల్ నుంచి విడిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో దేశ ప్రజలకు తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారన్నారు. రేవంత్ పాలన భేష్ అన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోయాయని తెలిపారు.

Read also: Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..

ఇవాళ హరీష్ రావు పర్యటననే ఓ జోక్ అన్నారు. నాగలి పట్టి దున్నిన మోహలా మీవి అన్నారు. మీ బ్రతుకులు కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ అని తెలిపారు. మీరు మంచి చేస్తే ఎందుకు ఓడిపోయారన్నారు. బీడీలు వేసిన చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. ప్రజలను నానా హింసలు పెట్టింది మీరే అని మండిపడ్డారు. ఓడిపోయి ఏమి చేయాలో తెలియక ఇలాంటి జోకులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్ర హారాలు మని రేవంత్ పని చేస్తున్నారని తెలిపారు. మీకు ఆత్మగౌరవం ఉందా? అని మండిపడ్డారు. మీకు రాష్ట్ర ప్రయోజనాల మీద కమిట్మెంట్ ఉందా అన్నారు. మీ రాజ్యసభ సభ్యులు ఏ స్కీం తెచ్చారన్నారు.

Read also: RJ Ventures: ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం.. 600 మంది నుండి రూ.150 కోట్లు వసూలు..

పువ్వాడ అజయ్ కు ఏమీ కనబడవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నాతో రా….కలిసి నడుద్దాం అన్నారు. నేను తిరిగిన ఊళ్ళు నీవు తిరిగావా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్ళు మోపిన భారాన్ని మీరు, మనం కట్టలిసినా పరిస్థితి అన్నారు. నెల కాగానే జీతాలు ఇస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలతో సుజాతనగర్ లో రైతులు ఇబ్బందులు పడితే రైతుకు 6500 ఇప్పించానని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులను రాష్ట్ర బహిష్కరణ చేయాలన్నారు. కొత్తగూడెంలో ఫ్రీ కండిషన్ ఎయిర్ పోర్ట్ రానుందన్నారు. ఆ రోజుల్లోనే కార్గో ప్లెయిన్ కూడా అడిగా అని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో అడవి అనేది లేకుండా పోయిందన్నారు. వైరాలో రైతులకు పంటల పై అవగాహన కోసం హాస్టల్ కట్టించాలని అనుకున్నామన్నారు. కొత్తగూడెం రైల్వే భూములను మనం తీసుకొని వాళ్లకు వేరే భూమి ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

Read also: Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..

ఖమ్మంను మర్చిపోనే పోను..నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను.ఆ బిరుదు అది శాసిత్వం అన్నారు. వచ్చే ఏడాది స్తంభాద్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. మత్స్యకారుల పండుగ రోజున పాలేరులో ఉత్సవాలు జరుపబోతున్నాం అన్నారు. నేలకొండపల్లి బౌద్ధ స్థూపం ను అభివృద్ధి చేయాలని టూరిజం శాఖ మంత్రిని కోరింది అన్నారు. కేటీపీఎస్ లో ఓ స్టేజి వచ్చిందంటే నా కృషి ఉంది అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పాల్వంచ స్పాంజ్ ఐరన్ ను మూసి వేసిందన్నారు. అక్కడి ట్రేడ్ యూనియన్ నాయకులతో మాట్లాడి మళ్ళీ తెరిపించాలని పోరాటం చేస్తాం అన్నారు. కేటీఆర్ మాటలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరం మొత్తం డొల్ల అంటే మీరు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. మూసి ప్రక్షాళన ముమ్మాటికీ అవసరమే అన్నారు. ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో జిల్లా అభివృద్ధి కోసం అన్నారు.
Manish Sisodia: లిక్కర్ కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఢిల్లి మాజీ డిప్యూటీ సిఎం

Show comments