కాంగ్రెస్ ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు వెళుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. అనేక ప్రభుత్వాల్లో.. శాఖల్లో పని చేసిన సమయంలో జిల్లా ఆభివృద్ధి ధ్యేయంగా పని చేశానని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్న పరిష్కరించానని పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన అధికారుల మార్పిడి, వరదల వల్ల కొంత కాలం ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఇప్పుడు పనులు స్పీడ్ అందుకున్నాయని వెల్లడించారు. 500 ఎకరాల్లో వెలుగుమట్ల ఎకో పార్క్ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. జూ పార్క్ ను ఏర్పాటు చేస్తాం.. ఖమ్మంకు చారిత్రాత్మకమైన ఖిల్లా పై రోపు వే ఏర్పాటు చేస్తాం.. హైదరాబాద్ శిల్పారామం మాదిరిగా వెలుగుమట్ల, ఖమ్మం ఖిల్లాను తయారు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.
Read Also: 2024 Political Rewind: ఈ ఏడాది ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ప్రముఖులు వీళ్లే!
కొత్త ఏడాదిలో పనులు ఏర్పాటు చేస్తాం.. రూ.700 కోట్లతో మున్నేరు ఖమ్మంలోకి రాకుండా చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రూ.220 కోట్లతో చెరువుల నుంచి ఖమ్మంలోకి వరద రాకుండా చేయనున్నామని.. ఖమ్మం నగరంలో రూ.220 కోట్లతో మంచినీటి సమస్య లేకుండా పథకం తీసుకొస్తామని తెలిపారు. అలాగే.. మెడికల్ కాలేజి నిర్మాణం చేయనున్నామని చెప్పారు. స్వామి నారాయణ్ ద్వారా స్కూల్ నిర్మాణం చేస్తున్నాం.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నాం.. ఖమ్మం పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయనున్నామని అన్నారు. ఖమ్మం మున్నేరు పై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాం.. జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నాం.. ఖమ్మంకు ఒక్క రింగ్ రోడ్డు మాదిరిగా జాతీయ రహదారుల మీదుగా చేస్తున్నామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Read Also: Tomato Price: టమాటా ధర భారీగా పతనం.. రైతుల గగ్గోలు..
గోదావరి జలాలు పది నియోజకవర్గాలకు రావడం తన కోరిక.. దానిని పూర్తి చేయడమే లక్ష్యమని తుమ్మల చెప్పారు. సీతారామ ప్రాజెక్టు మళ్ళీ వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాటికి యాతల కుంట టన్నెల్ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం.. జగ్గయ్య పేట నుంచి వైరా మీదుగా నేషనల్ హైవే నిర్మాణం చేస్తామని అన్నారు. కొత్తగూడెం నుంచి కౌతల రోడ్ నిర్మాణం చేస్తే భద్రాచలం కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. రూ.3000 కోట్లతో సీతమ్మ సాగర్ పూర్తి అయితే.. పోలవరం నుంచి కాళేశ్వరం వరకు గోదావరిలో వాటర్ వేస్ ను చేయాలన్న కోరిక ఉందని అన్నారు. పాండురంగపురం నుంచి భద్రాచలం వరకు రైల్వే లైన్ నిర్మాణం పై కేంద్రాన్ని అడుగుతున్నాం.. ఎయిర్ వేస్ కొత్తగూడెంకు అవకాశం వుందని తెలిపారు. కొత్తగూడెం మైనింగ్ కాలేజీ యూనివర్సిటీగా చేయాలని కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు.