NTV Telugu Site icon

KTR: మళ్ళీ కేసీఆర్ను సీఎంను చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదాం..

Ktr

Ktr

సత్తుపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దగ్గర నుంచి గమనిస్తున్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ఏమిటో నిన్నటి గ్రామసభలను చూస్తే తెలుస్తుందని అన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని గ్యారంటీలపై నిలదీస్తున్నారని తెలిపారు. సత్తుపల్లిలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానేనని కేటీఆర్ పేర్కొన్నారు. మళ్ళీ కేసీఆర్‌ను సీఎంను చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదాం అని తెలిపారు. ఉమ్మడి ఖమ్మంలో మళ్ళీ బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Stock Market: నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు 23 మంది బీఆర్ఎస్ నుంచి గెలిస్తే 17 మంది ఇంకా పార్టీలోనే కొనసాగుతుండటం పార్టీ పట్ల వారికున్న విధేయతకు నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. మరోవైపు.. రైతుల సమస్యలపై అధ్యయన కమిటీ వేశాం.. రానున్న రోజుల్లో ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు. త్వరలోనే సత్తుపల్లి నేతలతో కేసీఆర్ సమావేశమవుతారని కేటీఆర్ తెలిపారు.

Read Also: Maruti Suzuki: 12లక్షల మంది సొంతం చేసుకున్న నంబర్-1 ఎస్‌యూవీ.. బ్రాండ్ అంబాసిడర్‌ ప్రకటన