Harish Rao: కాంగ్రెస్ పార్టీ రైతుల ధాన్యం అమ్మకాలపై రివ్యూ చేయడం లేదని బిఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎక్కడెక్కడ తక్కువ మందు అమ్ముతున్నారు అని దానిపై మాత్రమే రివ్యూలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఎన్నికల ముందు బోనస్ ఇస్తామని ఇచ్చిన వాగ్దానం అంతా బోగస్ గా మారి పోయిందని హరీష్ రావు సెటైర్స్ వేశారు. వాయిస్ ఓవర్.. ఖమ్మం జిల్లాలో రెండు రోజులపాటు హరీష్ రావు పర్యటన కొనసాగుతుంది. హరీష్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ని సందర్శించారు. అక్కడ పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
Read also: CM Revanth Reddy: హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇదే..
రాష్ట్రంలో పత్తి రైతులు పెట్టుబడిన రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సీజన్లో కింటా పత్తికి 6000- 6500 మధ్య మాత్రమే వచ్చిందన్నారు. ఎంఎస్పి 7500 ఉంటే ఆ ధర ఎందుకు రైతుకు పలకడం లేదన్నారు. తేమశాతాన్ని ఇనాం ద్వారా చూడండి రైతుకు మద్దతు ధర ఇవ్వండి అని అన్నారు. కాంగ్రెస్ ప్రాధాన్యత మొత్తం కూడా మద్యం అమ్మకాలపైనే ఉంది కానీ రైతులపై లేదు అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్ని తాగించేందుకు ఎక్కడెక్కడ తక్కువగా తాగుతున్నారు రివ్యూలు మీటింగులు చేసి తెలుసుకుంటున్నారు అని మండిపడ్డారు. కానీ వడ్లు పత్తి మద్దతు ధరలపై ఎటువంటి రివ్యూ మీటింగ్ లో చేసే తీరిక లేదని విమర్శించారు. పత్తిని సిసిఐ కేంద్రాలు కొన్నది చాలా తక్కువగా ఉన్నదని, వ్యాపారులకు ఉన్నది ఎక్కువగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టమన్న సీసీఐ కేంద్రాలు ఎక్కడ ఎటుపోయాయని ప్రశ్నించారు.
Read also: Adilabad: పోలీసుల అదుపులో తుపాకులు సరఫరా చేసే ముఠా..!
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి బ్రహ్మాండంగా మాటలు చెబుతున్నారు కానీ, చేతల్లో లేదు అని హరీష్ రావు అన్నార. ఆంధ్రా నుంచి వచ్చిన దళారులు వడ్లు కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటివరకు ప్రభుత్వం 19 మెట్రిక్ టన్నులు వడ్లు కొనుగోలు చేసింది వారికి బోనస్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కానీ ఆ బోనస్ అంతా కూడా ఇప్పుడు బోగస్ గా మారిపోయిందని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న ఒకరిపై ఒకరు పై చేయి సాధించటం కోసం పోటీలు పడుతున్నారు తప్ప ప్రజల గురించి, అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని హరీష్ రావు ఆరోపించారు. రైతులు పండించిన అన్ని పంటలకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
President Droupadi Murmu: నేడు శిల్పారామంలో లోక్ మంథన్ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి