Site icon NTV Telugu

Minister Tummala: గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు..

Thumalla

Thumalla

Minister Tummala: గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ భద్రాద్రి నాది.. నా సొంతం అని ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖకి ఆదేశించారు.. జిల్లా మొత్తం తుఫాను వరదల ప్రభావంగా జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి.. బాధితులకు వెంటనే డబ్బులు అందే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కి మంత్రి సూచనలు చేశారు. రాముడు కరుణిస్తే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని.. రాజకీయపరంగా అధికారం పరంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాములవారికి సేవ చేసుకోవాలని తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు.

Read Also: kanchana4 : కాంచనా 4లో దెయ్యంగా నటించనున్న పొడుగుకాళ్ల సుందరి..

ఇక, ఈ తుఫాను వరదల కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగాలకి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభినందనలు తెలిపారు. గతంలో మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లుగా పని చేసిన అనేక మంది ఐఏఎస్ అధికారులు ఇప్పుడు కేంద్రస్థాయిలో ఉన్నత స్థాయిలో పని చేస్తున్నారు అని గుర్తు చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారులు అందరూ భద్రాచలంపై ప్రేమను చూపిస్తున్నారు.. ఇప్పటికీ నాకు ఫోన్ చేసి సార్ మన భద్రాద్రి, ఎలా ఉంది అని అడుగుతున్నారు.. ఉన్నత అధికారుల అండదండలు మనకు ఉన్నాయి.. అధికారులు అంతా చిత్తశుద్ధితో పని చేసి భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసే విధంగా కృషి చేయాలి అని తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.

Exit mobile version