NTV Telugu Site icon

Congress: ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ.. ఎన్నికల శంఖారావం పూరించనున్న రాహుల్ గాంధీ..!

Congress

Congress

తెలంగాణలో ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ నేడు జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరనున్నారు. ఈ సభ వేదికగా ప్రసంగించనున్న రాహుల్.. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించే ఛాన్స్ ఉంది. రాహుల్ గాంధీ ప్రసంగంపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.

Read Also: Women Lingerie : 8నెలలుగా ఆడవాళ్ల బ్రాలు, అండర్ వేర్ల దొంగతనం.. గాయపడిన 10మంది

ఇటీవ‌ల క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించ‌డంతో.. పొరుగున ఉన్న తెలంగాణ‌ కాంగ్రెస్ పార్టీకి ఊపు వ‌చ్చింది. దీంతో పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఇక, ఆ పార్టీ అధిష్టానం కూడా తెలంగాణలో వేగంగా పావులు కదుపుతుంది. ఖమ్మంలో జరిగే బహిరంగ సభతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలనకు తెరపడుతుందని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే, తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. రాహుల్ గాంధీజీ హాజరయ్యే సభను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Read Also: Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం.. అత్తాపూర్‌లో పాత కక్షలతో ఓ వ్యక్తి హత్య

ఇప్పటికే ఖమ్మం నగరంతో పాటు.. నగరానికి వచ్చే పలు మార్గాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. సభ వేదిక స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు కనబడేలా 50 అడుగుల ఎత్తున భారీ డిజిటల్‌ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాల్‌ను కూడా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

Read Also: Ileana D’cruz Pregnancy: ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణం ఇతడే.. ఫోటో పెట్టిందోచ్

ఖమ్మంలో జనగర్జన సభకు వస్తున్న రాహుల్ గాంధీ.. ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడ ఏపీ కాంగ్రెస్ నేతలు రాహుల్‌కు స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మంకు వస్తారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ సభావేదికపైకి రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు 1,360 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను రాహుల్‌గాంధీ సన్మానించనున్నారు.

Read Also: CM KCR: గోదావరి పరివాహక ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

దీంతో పాటు అదే వేదికపై పొంగులేటి శ్రీనివా‌స్ రెడ్డి, ఆయన అనుచరులు, ఇతర నేతలు రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. ఇక, ఈ సభ అనంతరం రాహుల్ గాంధీ రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Show comments