NTV Telugu Site icon

CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండా లో వరద ప్రవాహంలో కొట్టుకపోయిన తండ్రి, కూతురు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రోడ్డు మార్గాన డోర్నకల్ , కురవి మీదుగా పురుషోత్తయగూడెంకు చేరుకున్నారు. పురుషోత్తం గూడెం దగ్గర వరద ప్రభావంలో కొట్టుకపోయిన NH 365 జాతీయ రహదారి పరిశీలించారు. రహదారి పక్కన వరదతో జలమయం అయినా సీతారాం తండా వాసులకు భరోసా ఇచ్చారు. సీతారాంపురం తండాలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో ఆకేరు వాగు పొంగి ఇక్కడే యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణించారని తెలిపారు. అశ్విని మాతృమూర్తి, సోదరుడుని పరామర్శించా అన్నారు. అశ్విని యువ శాస్త్రవేత్త ఆమె మరణం బాధాకరం అన్నారు. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అశ్విని కుటుంబానికి ఇల్లు లేదు… ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

Read also: Jagadish Reddy: తూములను లాక్ చేయడం వల్లే ఎడమ కాలువ తెగింది..

ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో రెండు తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ మూడు తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు గాను, అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్టుమెంట్ ను ఆదేశిస్తున్నా అన్నారు. ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆకేరు ప్రవాహం… నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెన నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఆకేరు వాగు వరదతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. మా తండా వాసులు అందరికీ అశ్విని గొప్ప ఆదర్శం అన్నారు. మా పిల్లలకి చెప్తుంటాం.. ఆశ్వికి అక్క లా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకోవాలని, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా.. తండాకి వస్తే అందరినీ ఆప్యాయంగా పలకరించేది. కొంచం కూడా గర్వానికి పోయేది కాదన్నారు. గొప్ప వ్యక్తిని మా తండా కోల్పోయిందని సీఎం అన్నారు.
Terrible incident: మేడ్చల్‌లో దారుణం.. చెట్ల పొదల్లో పసికందు..

Show comments