NTV Telugu Site icon

Central Team: నేడు మున్నేరు, సూర్యాపేటలో కేంద్ర బృందం పర్యటన..

Khammam

Khammam

Central Team: నేడు మున్నేరు ముంపు ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనున్నారు. కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి ఖమ్మంలో బస చేశారు. ఇవాళ (గురువారం) ఖమ్మం రూరల్‌ మండలం, ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి, కోదాడ మండలాల్లో నష్టాన్ని పరిశీలిస్తారు.

Read also: Astrology: సెప్టెంబర్‌ 12, గురువారం దినఫలాలు

నిత్యావసర వస్తువుల నుంచి ఇంటి సామాగ్రి వరకు అన్నీ కొట్టుకుపోయాయి, కొన్ని వస్తువులు వున్నా పాడైపోయాయి సర్వం కోల్పోయాం.. మా జీవితాలకు ఆధారమైన పంట పొలాలు ఇసుక మేటలతో నిండిపోయాయి. ఇల్లు నీట మునగడంతో.. దిక్కుతోచని పరిస్థితిలో, మేము మా ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంటిపైకి ఎక్కామని .. ఆదుకోవాలని కేంద్ర బృందానికి వరద బాధితులు మెరపెట్టుకున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీనిని పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించింది. రెండు సబ్‌ టీమ్‌లుగా విడిపోయిన టీమ్‌.. ఒక సబ్‌ టీమ్‌ పంట, ఆస్తినష్టాన్ని పరిశీలించగా, మరో సబ్‌ టీమ్‌ తెగిపోయిన రోడ్లు, చెరువులు, వంతెనలు, కాల్వలు తదితర వాటిని పరిశీలించింది. అక్కడక్కడా రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖలు వరద నష్టాన్ని కేంద్ర బృందం సభ్యులకు వివరించారు.
Pregnancy Drama: 9 నెలల గర్బిణీ బాత్రూంలోకి వెళ్లింది.. ప్రెగ్నెన్సీ మాయమైంది.. ట్విస్ట్ ఏంటంటే?

Show comments