Bhadrachalam Rains: భద్రగిరిని ముంచెత్తిన వాన.. అన్నదాన సత్రంలోకి వరద నీరు..
- వర్షం కారణంగా నీటమునిగిన భద్రాచలం..
- డోర్నకల్ శివారు మున్నేరు వాగు ఉధృతం..
- రామాలయం- అన్నదాన సత్రం పరిసరాల్లోకి వరద..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadrachalam Rains: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా భద్రాచలం నీటమునిగింది. రామాలయం, అన్నదాన సత్రం పరిసరాల్లోకి వరద చేరింది. ఆలయ కొండపై ఉన్న కుసుమ హరినాథబాబా ఆలయ కల్యాణమండపం కూలిపోయింది. భద్రాద్రి జిల్లా గరిమళ్లపాడులో అత్యధికంగా 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కిన్నెరసాని, తాలిపేరు రిజర్వాయర్లలోకి వరద నీరు చేరడంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. మహబూబాబాద్‌లోని ఉత్తరతాండ పంచాయతీ నేతాజీ తండా పాఠశాల గదులు జలమయమయ్యాయి. డోర్నకల్ శివారు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురంలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 29.9 అడుగులకు చేరుకుంది.
Read also: Weather Warning: వాతావరణ హెచ్చరిక.. మూడు రోజులు భారీ వర్షాలు..
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి. రాయలసీమ నుంచి తమిళనాడు అంతర్భాగం మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర, దక్షిణ ద్రోణిలు కొనసాగుతున్నాయని, దీని కారణంగా తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలోని జోగుళాంబ గద్వా, భదాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, ములుగు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Mahesh Babu-Vinesh Phogat: పతకం ముఖ్యం కాదు.. మీరే నిజమైన ఛాంపియన్!
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!