NTV Telugu Site icon

Hand Casting: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి.. ఆ భర్త చేసిన పని అందరి హృదయాలను కదిలించింది..

Hand Casting

Hand Casting

Hand Casting: భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి.. అప్పుడే ఆ కాపురం పచ్చగా ఉంటుందని చెబుతారు.. భర్తకి భార్య బలం కావాలి.. కానీ, బలహీన కాకూడదు అంటారు.. అయితే, ఓ వ్యక్తి.. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమలో పడడం కాదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. వారి బంధం ఎంతో అనోత్యంగా సాగింది.. వారి దాంపత్య జీవితంతో ఓ కూతురు కూడా పుట్టింది.. కానీ, విధి చాలా విచిత్రమైనది.. ఆ ఇల్లులను దూరం చేసింది.. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక.. జీవచ్ఛవంలా మారిన ఆ భర్త.. తన భార్య గుర్తుగా హ్యాండ్‌ కాస్టింగ్‌ చేయించి తన ప్రేమను చాటుకున్నాడు.

Read Also: Carlos Alcaraz: సంచలనం.. రెండవ రౌండ్‌లోనే కార్లోస్ అల్కరాజ్‭కు ఎదురుదెబ్బ..

ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ ప్రేమించుకుని 2006లో పెళ్లి చేసుకున్నారు. అశోక్ ప్రైవేట్ జాబ్ చేస్తూ సత్తుపల్లి పట్టణంలో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది.. అయితే ఆనందంగా సాగుతున్న అశోక్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన భార్య పద్మశ్రీ.. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న తన జీవిత భాగస్వామి ఆకస్మికంగా మృతి చెందడంతో అశోక్ తట్టుకోలేకపోయాడు. భార్య గుర్తుగా తన చేయి, తన కూతురు చేయి, చనిపోయిన తన భార్య చేయిని కలిపి విజయవాడ నుండి ప్రత్యేకంగా వచ్చిన కాస్టింగ్ నిపుణులతో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేయించి.. తన గుర్తుగా పెట్టుకున్నాడు. భార్య మృతితో అశోక్ జీవచ్చావం లా మారిపోయాడు. పెళ్లైన 16 ఏళ్లకే తన భార్యను కోల్పోయిన భర్త ఆవేదనను చూసి బంధువులు కంటతడి పెట్టారు. ఇక, భార్య గుర్తుకు తాను తయారు చేయించిన హ్యాండ్‌ కాస్టింగ్‌ అందరి హృదయాలను కదిలిస్తోంది.