Khammam medical student died in America: చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా తర్వాత యువకుల్లో గుండెపోటులు ఎక్కువయ్యాయి. డ్యాన్స్ చేస్తూ ఒకరు, జిమ్ చేస్తూ ఒకరు, ప్రయాణిస్తూ ఒకరు ఇలా.. ఒకేసారి కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ఏ కారణం చేతనైనా కొందరు నవ్వుతూ.. నడుస్తూ.. ఆడుతూ.. పాడుతూ హఠాత్తుగా కుప్పకూలి.. ఇటీవల అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందారు.
Read also: Beer sales: తెగ తాగేస్తున్నారు.. బీర్ల అమ్మకాల్లో తెలంగాణ టాప్
ఖమ్మం జిల్లా రూరల్ మండలం సాయిప్రభాతనగర్‌లో నివసించే టి.రవికుమార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు.. పెద్ద కుమారుడు హేమంత్ శివరామకృష్ణ (20) 2021లో మెడిసిన్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. హేమంత్ ప్రస్తుతం బార్బడోస్‌లోని ఓ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం సరదాగా స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన హేమంత్ కాసేపు ఈత కొట్టాడు. ఆ తర్వాత గుండెపోటు వచ్చి బీచ్‌లో కుప్పకూలిపోయాడు. స్నేహితులు హేమంత్‌ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే హేమంత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. హేమంత్ మృతితో రవికుమార్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అమెరికాలో చదివి డాక్టర్ కావాలంటే చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు రోదించారు. తమ బిడ్డలపైనే ఆశలన్నీ పెట్టుకున్నామని, తమ కుమారుడిని దేవుళ్లు అర్ధాంతరంగా తీసుకెళ్లారని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. హేమంత్ మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Rubber Man: మనిషా లేక రబ్బరా.. శరీరాన్ని అలా మెలికలు తిప్పేస్తున్నాడేంటి