Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khairatabad Ganesh : గణేష్ ఉత్సవాల సందర్భంగా నగరంలోని రద్దీ ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు , ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు షీ టీమ్స్ డీసీపీ లావణ్య వెల్లడించారు. ఎన్టీవీ (NTV) కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ వివరాలను పంచుకున్నారు. ఉత్సవాల వేళ మహిళల భద్రతే ధ్యేయంగా మొత్తం 26 ప్రత్యేక బృందాలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఆకతాయిల చేష్టలను, వేధింపులను పక్కా ఆధారాలతో సహా రికార్డు చేసి పట్టుకున్నామని, ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటివరకు 1,100కు పైగా కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
51 మంది మైనర్లకు కౌన్సెలింగ్.. 26 మంది మేజర్లకు శిక్ష
నమోదైన కేసుల్లో 51 మంది మైనర్లు ఉన్నారని, వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో బాధ్యతాయుతంగా కౌన్సెలింగ్ ఇచ్చామని డీసీపీ లావణ్య తెలిపారు. మిగిలిన వారిలో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులు, యువకులు ఉన్నారని వివరించారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆధారాలతో చిక్కిన మేజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, అందులో 26 మందికి కోర్టు ఇప్పటికే శిక్షలు విధించిందని పేర్కొన్నారు. రద్దీ ప్రదేశాలలో మహిళలను వేధించాలని చూస్తే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.
Also Read
శోభాయాత్రకు 26కు పైగా షీ టీమ్స్..
రేపు జరగనున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని డీసీపీ లావణ్య తెలిపారు. శోభాయాత్ర పొడవునా మహిళల రక్షణ కోసం 26కు పైగా షీ టీమ్స్ నిరంతరం విధుల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఉత్సవాల్లో గానీ, శోభాయాత్రలో గానీ అమ్మాయిలను, మహిళలను ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులకు గురిచేస్తే భయపడకుండా వెంటనే స్పందించాలని కోరారు. బాధితులు లేదా ప్రత్యక్షంగా చూసిన ప్రజలు తక్షణమే డయల్ 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని, బాధ్యులపై నిమిషాల వ్యవధిలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!