బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ వచ్చాక నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కేసీఆర్ నీరోచక్రవర్తిలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ దేశంలో అత్యంత హీనంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వారికి జీతాలు ఇవ్వడం లేదు. ఏడాదిలో ఎక్కువ రోజులు ఫాంహౌస్‌లోనే ఉండే ముఖ్య మంత్రి కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎంతో మంది ఆఫీసర్లు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు అలాంటి వారి పరిస్థితి ఏమైందో ఒక్కసారి చరిత్రను చూడండి అంటూ అధికారుపై ఈటల ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఈటల ఆరోపించారు. బియ్యం కొనలేదని కేంద్రం ఎప్పుడు చెప్పలేదు. ఉప్పుడు బియ్యాన్ని కేవలం తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో మాత్రమే తింటారని అవి ఆ రాష్ర్టాలు పండించుకుంటున్నాయని కేంద్రం తెలిపిందన్నారు.
ఇప్పటి వరకు బియ్యం కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. నన్ను భయపెట్టేలేరన్న కేసీఆర్ మెడ మీద కత్తిపెడితే సంతకం చేస్తారా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ఓ పిరికి పంద.. రైతు వేదికలను భ్రష్టు పట్టిస్తున్నారు. 2018లో నిరుద్యోగ భృతి ఇస్తానని మ్యానిఫెస్టోలో చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగం, తెలంగాణ పేద ప్రజల ఊసురు కేసీఆర్‌కు తగులుతుంది. నీ లాఠీలు, తుటాలు, జైళ్లు మమ్ముల్ని ఏం చేయలేవు. నీ పదవుల కోసం ఎదురు చూసేవాళ్లు తప్ప.. నీకోసం త్యాగాలు చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. నరేంద్ర మోడీ, అమిత్‌షాకు ఢిల్లీలో దండం పెట్టి ఇక్కడకు వచ్చి పులిలా మాట్లాడుతావ్.. ప్రగతిభవన్‌చుట్టు ఉన్న ఇనుప కంచెలను తీసేసీ ప్రజలతో మాట్లాడు.. ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ ఈటల కేసీఆర్‌కు చురకలు అంటించారు.
