KCR : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముగిసిన కేసీఆర్‌ విచారణ

  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముగిసిన కేసీఆర్‌ విచారణ
  • కేసీఆర్‌ను నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించిన సిట్‌.
  • కేసీఆర్ ను ప్రశ్నించిన ఆరుగురు సభ్యుల సిట్ బృందం
  • సాక్ష్యాలు, స్టేట్‌మెంట్లపై వివరణ నమోదు
Kcr Sit

Kcr Sit

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఘట్టం ముగిసింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం వరకు ఉత్కంఠగా సాగింది. ఏసీపీ స్థాయి అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల సిట్ బృందం ఈ విచారణలో పాల్గొంది. కేవలం ప్రశ్నలు అడగడమే కాకుండా, ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్లను కేసీఆర్ ముందు ఉంచి వివరణ కోరినట్లు సమాచారం.

గతంలో విచారించిన అధికారుల వాంగ్మూలాలను, సాంకేతిక ఆధారాలను కేసీఆర్‌కు చూపించి, వాటిపై ఆయన వెర్షన్‌ను సిట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? అందులో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో ప్రశ్నించినట్లు  తెలుస్తోంది. కేసీఆర్ విచారణ అనంతరం కేసీఆర్ స్టేట్మెంట్ రికార్డ్స్, విచారణకు వినియోగించిన రెండు ట్రంకు డబ్బాలు పలు ఫైల్స్ ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువెళ్లారు.

Russia-Ukraine: శాంతి దిశగా అడుగులు.. వచ్చే వారం రష్యా-ఉక్రెయిన్ చర్చలు!