NTV Telugu Site icon

KCR: హైకోర్టులో కేసీఆర్‌కు చుక్కెదురు.. ఆ పిటిషన్ కొట్టివేత

Kcr

Kcr

KCR: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్‌ కమిషన్‌ ఏర్పాటును రద్దు చేయాలని కేసీఆర్‌ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనలు హైకోర్టు సమర్థించింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించవచ్చంటూ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Read Also: New Criminal Laws: నేటినుంచి అమల్లోకి కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు

బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఆ కమిషన్‌ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయగా.. దీని విచారణ అర్హతపై ఇరు వర్గాలు వాదనలు వినిపించగా.. విచారణ అర్హత లేదని ప్రభుత్వ వాదనల న్యాయస్థాన ఏకీభవించింది. విద్యుత్‌ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ ఏర్పాటైందని కేసీఆర్‌ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదనలు వినిపించారు. పద్దతి ప్రకారమే విచారణ జరగుతోందని, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారుల్ని కూడా కమిషన్ విచారించిందని.. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.