Site icon NTV Telugu

KCR National Party: నేడు ప్రగతిభవన్‌లో కీలక భేటీ.. జాతీయ పార్టీపై చర్చించనున్న కేసీఆర్

Kcr

Kcr

KCR National Party: జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇవాళ తెరాస నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండాపై స్పష్టతనిచ్చే అవకాశముంది. దసరా నాడు ప్రకటించనుండడంతో ఏం చేయాలనే దానిపై దృష్టి సారించారు గులాబీ బాస్. ప్రగతి భవన్‌లో జరిగే ఈ కీలక సమావేశంలో మంత్రులతో పాటు 33 జిల్లాల అధ్యక్షులు హాజరు కానున్నారు. జాతీయ పార్టీ మీదే ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. జాతీయ పార్టీని ప్రకటించే రోజు దగ్గర పడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 5న తెరాస విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి మద్దతుగా తీర్మానం చేయనున్నారు.

అందుకు దైవానుగ్రహం ఉండాలనే కారణంతో వివిధ ఆలయాలను కూడా కేసీఆర్ సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ నెల 4న కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌పై కూడా కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ ప్రకటనతో మిగతా వ్యవహారాలు సజావుగా సాగేందుకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాలన్నింటిపై ఇవాళ కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.

double bedroom scam: డబుల్ బెడ్రూం స్కాంలో నలుగురి అరెస్ట్

మరో వైపు జాతీయపార్టీ ఏర్పాటుపై కసరత్తు తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యనేతలతో ఇవాళ సమావేశం నిర్వహించి సమాలోచనలు చేయనున్నారు. జాతీయపార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ నేతలతో కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. దసరారోజు వివిధరాష్ట్రాలకు చెందిన రైతు,కార్మికసంఘాలు, పార్టీలనేతల్ని ప్రగతిభవన్‌లో భోజనానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 6 లేదా 7న భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు సమాచారం.

Exit mobile version