NTV Telugu Site icon

KCR Bus Yatra: నేడు ఖమ్మం జిల్లాల్లో కేసీఆర్ బస్సుయాత్ర..

Kcr Bus Yatra

Kcr Bus Yatra

KCR Bus Yatra: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లను అధిక శాతం కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు… బస్సుయాత్రలు చేస్తూ జనంలోకి చేరారు. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని కేసీఆర్ అన్నారు.

Read also: The Raja Saab :రాజసాబ్ లో స్పెషల్ సాంగ్..ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ హంగామా..

నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని… కేసీఆర్ పాలన బాగుందని… ప్రజలు కూడా గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. దీంతో కేసీఆర్ ఎక్కడ సభ నిర్వహించి బస్సుయాత్ర నిర్వహించారో… జనం భారీగా తరలివస్తున్నారని పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లాడ, జూలూరుపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది.

Read also: Patanjali : బాబా రామ్‌దేవ్‌ తప్పుడు ప్రకటనల కేసు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

బస్సు యాత్ర నేపథ్యంలో 12 లోక్ సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ బస్సు యాత్ర మే 10న సిద్దిపేటలో ముగుస్తుంది. ఈ పర్యటనలో కేసీఆర్ రోడ్ షోలకే పరిమితం కాకుండా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతారు. ఉదయం రైతులు, మహిళలు, యువకులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలతో ప్రత్యేక సమావేశాలకు ఏర్పాట్లు చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడతామన్నారు.

Read also: Pakistan: భారత్ అగ్రరాజ్యంగా మారుతుంటే.. మేము అడుక్కుంటున్నాం..

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. 23 ఏళ్లలో ఉద్యమనేతగా, ముఖ్యమంత్రిగా వందలాది బహిరంగ సభలు, వేల సభలు, రోడ్ షోలతో రాష్ట్రంలో పర్యటించిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నల్గొండలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కరీంనగర్ మరియు చేవెళ్ల. నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో పొలంబాట పేరుతో బస్సు యాత్ర నిర్వహించారు.
Glass Symbol Tension: ఇండిపెండెంట్లకు ‘గాజు గ్లాసు’ సింబల్.. కూటమి నేతలకు కునుకు కరువు..!