Site icon NTV Telugu

Kavitha : ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు.. నేను ఫ్రీ బర్డ్‌ని

Kavitha

Kavitha

Kavitha : కరీంనగర్ జిల్లా పరిధిలో జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాట పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు. “సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం అన్ని వర్గాల వారినీ కలుపుకొని ముందుకు సాగుతున్నాం. విద్య, వైద్యం వంటి కీలక అంశాలు ఇంకా జనాల మధ్య లోతుగా చేరాల్సి ఉంది,” అని కవిత తెలిపారు.

సింగరేణి సంస్థను కాపాడడంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసిన ఆమె, ఆర్టీసీ విభాగంలో ఉన్న సమస్యలపై విప్లవాత్మక ఆలోచన అవసరమని సూచించారు. “సామాజిక తెలంగాణను సాకారం చేయడం మనందరి బాధ్యత,” అని అన్నారు. “తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి మనం అందరం కృషి చేశాం. కానీ కరీంనగర్ జిల్లాలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ సమస్యలపై దృష్టి పెట్టాలి,” అని వ్యాఖ్యానించారు. పంటనష్టంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు చనిపోతే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గురుకుల పాఠశాలల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. “రాష్ట్రంలో మైనారిటీ సమస్యలను పట్టించుకోవాలి. మైనారిటీ అభివృద్ధికి కనీసం రూ.2,000 కోట్లు కేటాయించాలి. ఎన్నికలు సమీపించాకే మైనారిటీల గుర్తొచ్చాయా?” అని ప్రశ్నించారు. తన రాజకీయ పరిస్థితిపై స్పందిస్తూ కవిత, “ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు.. నేను ఫ్రీ బర్డ్‌ని. పర్యావరణ పరిరక్షణను మా జాగృతి ప్రాధాన్యంగా తీసుకుంటుంది. తెలంగాణలో రాజకీయ శూన్యత నెలకొంది, ప్రజల గొంతుకగా మారబోతున్నాం,” అని తెలిపారు.

మానకొండూర్ నియోజకవర్గంలో పంటనష్టం జరిగినా, అక్కడి ఎమ్మెల్యేలు స్పందించలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇప్పటివరకు కార్మిక చట్టాలపై స్పందించలేదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నిశ్శబ్దంగా వ్యవహరిస్తోందని కవిత పేర్కొన్నారు. తన ఎమ్మెల్సీ పదవీ రాజీనామా అంశంపై మళ్లీ చైర్మన్, స్పీకర్‌లను కలుస్తానని తెలిపారు. “నేను తెలంగాణ ప్రజల బాణాన్ని. ప్రజల కోసం, సమాజం కోసం నా గొంతు వినిపిస్తూనే ఉంటాను,” అని కవిత స్పష్టం చేశారు.

JD Vance – Erika Kirk: “నా భర్తను జేడీ వాన్స్‌లో చూస్తున్నా”.. ఉషా కాపురంలో ఎరికా కిర్క్ నిప్పులు పోస్తుందా..?

Exit mobile version