ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలిజం వేళ్లూనుకున్న అందమైన అటవీప్రాంతం.. సమసమాజ స్థాపనకై ప్రాణాలర్పించి… విప్లవ చరిత్రను అడవిలోని అణువణువుకు అందించిన ప్రాంతం.. తెలంగాణ లోని నక్సలిజానికి పెట్టనీ గోడగా నిలిచిన దట్టమైన అటవీ ప్రాంతం .. మావోయిజం హాట్ బెడ్ గా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా లోని వెంకటాపురం మండలం లోని కర్రెగుట్టలు… మొన్నటి వరకూ ఆపరేషన్ కగార్ పేరుతో ఎక్కడ చూసినా తుపాకీల మోతలు… భయం గుప్పిట్లో జనాలు… ఇప్పుడు విశాలవంతమైన రోడ్లు.. అభివృద్ధికి ఆహ్వానిస్తూ అక్కడి గ్రామ ప్రజలు ఏమంటున్నారు..
కర్రెగుట్ట దట్టమైన అటవీ ప్రాంతం. గతంలో ఇక్కడికి రావాలంటేనే భయపడిపోయే జనాల కోసం ఇప్పుడు రోడ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎప్పుడూ బాంబుల మోత.. చుట్టుపక్కల ఎక్కడ నుంచి ఏ తుపాకీ పేలుతుంది తెలియని పరిస్థితి.. ఎక్కడ ఏ ల్యాండ్ మైన్ ఉంటుందో తెలియని అయోమయం నుంచి.. ఇప్పుడు పామునూరు గ్రామంలో బేస్ క్యాంప్ లు వచ్చాయి. అసలు ఈ బేస్ క్యాంప్ లో ఏముంది? బేస్ క్యాంప్ రాక తో జనాలకు కలిగిన మేలేంటి ?
ఒకప్పుడు కర్రెగుట్ట ప్రాంతం నచ్చలైట్లకు సేఫ్ జోన్ గా ఉండేది. ఈ కర్రేగుట్టలు వరంగల్ జిల్లాలో మొదలై ఛత్తీస్గడ్ రాష్ట్ర వరకు విస్తరించి ఉన్నాయి.. అంతర్రాష్ట్ర సరిహద్దు కావడంతో పోలీసులకు నక్సలైట్ లను కట్టడి చేయాలంటే కత్తి మీద సాములా ఉండేది.. వారికి అది అప్పుడు పెను సవాల్ గా మారేది.. కానీ కేంద్ర ప్రభుత్వం మావోయిజం అంతానికి డెడ్లైన్ విధించిన తరువాత.. పెద్ద ఎత్తున ఈ కర్రేగుట్టల్లో కూంబింగ్ ఆపరేషన్లు నెలల తరబడి జరిగాయి… ఎన్నో ఎన్కౌంటర్లకు సాక్ష్యంగా ఈ కర్రేగుట్టలు నిలిచాయి… అలాంటి కర్రెగుటల్లో ఇప్పుడు ఒక ప్రశాంత వాతావరణ కనిపిస్తోంది.. జనాలు చాలా సాధారణంగా తిరుగుతున్నారు.. ఏకంగా రాష్ట్ర డీజీపీ కర్రెగుట్టల్లో పర్యటించారు.. ఒకప్పుడు సాయంత్రమైతే చాలు ఒక్క పురుగు ఉండేది కాదు.…
రాష్ట్రంలో మావోయిస్టులు పూర్తిగా అంతమయ్యారంటున్నారు రాష్ట్ర DGP శివధర్ రెడ్డి. కర్రెగుట్టల్లో ఆదివాసీలను అభివృద్ధి పథాన నడిపించేందుకు రంగం సిద్ధం అవుతోందని, అందరితో అనుసంధానం చేసేందుకు.. భద్రత కల్పించేందుకు తామున్నామని అంటున్నారు.. శివధర్ రెడ్డి. ఒకప్పుడు కర్రెగుట్టలోకీ ఎవరు రావాలన్నా భయపడేది కానీ ఆపరేషన్ కగార్ అనంతరం స్వేచ్ఛగా తిరిగేందుకు అన్ని సౌకర్యాలు కల్పన జరుగుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్లు నిర్మాణం పూర్తవ్వొచ్చిందని… మౌలిక వసతులు కల్పనకు ఇప్పటికే తెలంగాణ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. అటవీ వనరులను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నామని అంటున్న రాష్ట్ర DGP శివధర్ రెడ్డి తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్…