NTV Telugu Site icon

Crime: ముగ్గురి స్నేహితుల మధ్య గొడవ.. ఒకరు హతం

Killed

Killed

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 15న వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పపూర్ లో ఎల్లమ్మ గుడి దగ్గర వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే, వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. తాగిన మైకంలో ముగ్గురి స్నేహితుల మధ్య గొడవ జరిగింది.. వారి మధ్య మాట మాట పెరగడంతో ఇద్దరు కలిసి మరో స్నేహితుడిని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు అని చెప్పారు.

Read Also: Journey Of Love 18 Plus : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ టీనేజ్ బ్లాక్ బస్టర్.. తెలుగులో ఎక్కడ చూడాలంటే?

అయితే, వేములవాడ తిప్పపూర్ ఎల్లమ్మ గుడి వద్ద చందనం శ్రీనివాస్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి చెప్పారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఈరోజు ఇదరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిట్లు పేర్కొన్నారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ తానా గ్రామానికి చెందిన చందనం శ్రీనివాస్ ఈనెల 15న తిప్పాపూర్ ఎల్లమ్మ ఆలయం వెనుక వైపు హత్యకు గురయ్యాడని, కేసు దర్యాప్తు చేయగా శ్రీనివాస్, ముంబాయి లతూరుకి చెందిన బబ్లూ జాఫర్ షేక్, జావిద్ జాఫర్ షేక్ లు ముగ్గురు స్నేహితులని వీరు తరచుగా మద్యం సేవిస్తూ ఉండేవారని డీస్పీ చెప్పారు.

Read Also: Ganesh Chaturthi: గణేశుడికి 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరణ

ఈ క్రమంలోనే ముగ్గురు ఈనెల 15వ తేదీన తిప్పాపూర్ ఎల్లమ్మ ఆలయం దగ్గర మద్యం సేవిస్తూ ఉండగా ముగ్గురి మధ్య ఏదో గొడవ జరిగిందని.. దీంతో బబ్లూ, జావిద్ లు కలిసి శ్రీనివాస్ ను తీవ్రంగా కొట్టడంతో, శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడని డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. హత్య చేసిన నిందితులు పారిపోగా నేడు (సోమవారం) వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

Show comments