Ponnam Prabhakar: ఆర్టీసీ లో ఉద్యోగులు ,కార్మికులకు పీఆర్సి ,కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ,డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్ లని మొదటి విడత గా ప్రారంభిస్తున్నామన్నారు. జేబీఎం సంస్థ తో ఆర్టీసీ ఒప్పందం చేసుకుందన్నారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్ లను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డిజిల్ బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నమని తెలిపారు. హైదరాబాద్ లో అన్ని ఎలక్ట్రిక్ బస్ లు నడిపేలా చూస్తామన్నారు. విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీ ని మెరుగు పరుస్తామని తెలిపారు. రాష్ట్ర మహా లక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుండి రూ.3200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం మహిళలు చేశారన్నారు. ఆర్టీసీ బస్ లకి ఇప్పుడు డిమాండ్ పెరిగిందన్నారు. ఆర్టీసీ – ప్రభుత్వం కలిపి త్వరలోనే బస్ ల కొనుగోలు చేస్తామన్నారు. ఆర్టీసీ లో ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సి ,కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామన్నారు.
Mallu Bhatti Vikramarka: లేక్స్ లేకపోతే విజయవాడ పరిస్థితే హైదరాబాద్ కు..