NTV Telugu Site icon

CMR Shopping Mall: సీఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన పాయల్ రాజ్పుత్..

Cmr

Cmr

తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ను కరీంనగర్లోని మార్కెట్ రోడ్ లో శుక్రవారం ఉదయం 9.38 గం.కు సినీ తార పాయల్ రాజ్పుత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆచలిమెడ లక్ష్మీ నరసింహరావు, డా. వి. సూర్యనారాయణ రెడ్డి. డా. భూంరెడ్డి హాస్పిటల్స్, డా. వి. రమాదేవి, మొదటి కొనుగోలుదారు చిదుర సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Delhi: ఆల్‌పార్టీ నేతలతో స్పీకర్ భేటీ.. మోడీ, రాహుల్ హాజరు

ఈ సందర్భంగా.. సి.ఎం.ఆర్. ఫౌండర్ & చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. తమ సంస్థను గత 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. తమ 32వ షోరూమును కరీంనగర్లో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు. సి.ఎం.ఆర్.లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమకు కావాల్సిన అన్ని రకాల వేడుకలకు సి.ఎం.ఆర్. తగు విధంగా, అన్ని మోడల్స్ కుటుంబమంతటికీ నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించటం సి.ఎం.ఆర్. ప్రత్యేకత అన్నారు. తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సి.ఎం.ఆర్. అందిస్తుందని తెలిపారు. సి.ఎం.ఆర్. మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ.. తన 32వ షోరూమును కరీంనగర్లో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందన్నారు. సి. ఎం. ఆర్. అంటే ది వన్ స్టాప్ షాప్ అంటే ఫ్యామిలీ.. అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయన్నారు. తమ వద్ద అందరికీ అందుబాటు ధరలలో లక్షలలో డిజైన్లు వేలల్లో వెరైటీలు లభిస్తాయని తెలిపారు.

Bhagyashri Borse: అది కష్టం అనిపించింది : హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంటర్వ్యూ

ప్రముఖ సినీతారలు పాయల్ రాజ్పుత్, సంయుక్త మీసన్ జ్యోతిప్రజ్ఞ్వాలన చేసి.. అన్ని సెక్షన్లు తిరుగుతూ షోరూములో ఉన్న అన్నిరకాల డిజైన్లు పరిశీలించారు. సి.ఎం.ఆర్. గత 40 సంవత్సరాలుగా వస్త్ర వ్యాపార రంగంలో క్వాలిటీకి, డిజైన్కు ప్రత్యేకత నిస్తూ తెలుగురాష్ట్రాలలో అగ్రగామిగా నిలిచింది. సిఎంఆర్ అంటే కుటుంబమంతటికీ మెచ్చే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని కొనియాడారు.

Show comments