NTV Telugu Site icon

కాంగ్రెస్‌ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ వివేక్..

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం హీట్‌ ఎక్కుతోంది. మంగళవారం హుజురాబాద్ లో ఈటలకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్, హరీష్ రావు ల స్నేహం మధ్య చిచ్చు పెట్టింది కేటీఆర్‌ అని, ఓటమి భయంతో ఏదో ఒకటి చెప్పాలని కేటీఆర్ చెప్తున్నారన్నారు. సుమన్ భాష మార్చుకోవాలి మొనగాడు ఎవరో సీఎం కేసీఆర్ ను అడిగితే చెప్తాడన్నారు. మేము కాంగ్రెస్ లో ఎందుకు పోతం బీజేపీ బలోపేతానికి పని చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏడు సంవత్సరాల పాలన అప్పుల పాలనగా మారిందని, సీఎంఓ అఫీస్ లో ఒక్క దళిత అధికారి ఎందుకు లేడని ప్రశ్నించారు.

గత నాలుగు నెలల నుంచి దళిత బంధు డబ్బులు అన్ని దళిత కుటుంబాలకు డబ్బులు ఇవ్వాలని కోరింది బీజేపీ పార్టీనే అని అన్నారు. దళిత బంధు డబ్బులు అకౌంట్ లలో వేసినం అని ఫ్రిజ్ చేసింది కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ దళిత బంధు నిలిపివేస్తుందని టీఆర్ఎస్ కు ముందే తెలుసునన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీని దళితులు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎక్కడ ఓడిపోతాదో కేటీఆర్ అక్కడ ఉండడని ఎద్దేవా చేశారు.