NTV Telugu Site icon

Bandi Sanjay: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే..

Bandi Sanjay

Bandi Sanjay

ఈరోజు కరీంనగర్‌లోని మమతా థియేటర్‌లో బీజేపీ కార్యకర్తలు, ఏబీవీపీ నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ ‘జితేందర్ రెడ్డి’ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన సినిమా హీరో రాకేశ్ వర్రె.. దర్శక, నిర్మాతలు, సినిమా యూనిట్ సభ్యులను అభినందించారు. అనంతరం వారితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. అబద్దాలంటేనే కాంగ్రెస్ పార్టీ.. మోసాలు, అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. మహారాష్ట్రకు పోయి అబద్దాలు చెప్పడం కాదా..? తెలంగాణలో తిరిగి ఆ విషయాలు చెప్పే దమ్ముందా..? కాంగ్రెస్ పార్టీ నిజంగా 6 గ్యారంటీలను అమలు చేసి ఉంటే.. కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో ఇచ్చిన యాడ్స్‌లో ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదు..? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అమలు చేశామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇంకా 20 లక్షల మంది రైతులకు నయాపైసా రుణమాఫీ కాలేదని చెప్పే దమ్ముందా? అని అన్నారు. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500, నిరుద్యోగులుకు రూ.2 లక్షల మాఫీ, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, వృద్దులకు నెలనెలా రూ.4 వేల ఫించన్, పేదలందరికీ ఇండ్లు ఇచ్చారా? అని అన్నారు. ఇవేమీ అమలు చేయకుండా మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గు చేటు.. తాము కూడా మహారాష్ట్రలో తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బయటపెడతామని బండి సంజయ్ పేర్కొన్నారు.

Ram Narayan: ప్రముఖ లెజెండరీ సారంగి ప్లేయర్ రామ్ నారాయణ్ కన్నుమూత

6 గ్యారంటీలు, రుణమాఫీపై నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే నివేదికను బయటపెట్టేందుకు కూడా రేవంత్ సర్కార్ వెనుకాడుతోందని తెలిపారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో కర్రు కాల్చి వాతపెట్టారని అన్నారు. ఈసారి మహారాష్ట్రలో కూడా అదే జరగబోతోంది.. బీజేపీపై యుద్దం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు.. దేనికోసం యుద్దం చేస్తారు? అని విమర్శించారు. ఈ దేశంలో 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నందుకా..? 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చినందుకా..? ట్రైబల్ వర్శిటీ ఇచ్చినందుకా..? ట్రిబుల్ ఆర్ రోడ్డుకు నిధులు ఇస్తున్నందుకా..? స్మార్ట్ సిటీ నిధులు ఇస్తున్నందుకా..? గ్రామాలకు నిధులు ఇస్తున్నందుకా..? జాతీయ రహదారుల కోసం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నందుకా..? అని కామెంట్స్ చేశారు.

Supreme Court: తిరుపతి ప్రత్యేక రాష్ట్రం కోసం పిటిషన్.. సుప్రీంకోర్టు తిరస్కరణ

కేసీఆర్ సర్కార్ తెలంగాణలోని ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయలకు పైగా అప్పు చేసి దోచుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు మించి అప్పులు చేస్తూ ప్రజలను బిచ్చగాళ్లను చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో ప్రజలు కేసీఆర్‌ను ఎప్పుడో మర్చిపోయారు.. అందుకే ఫాంహౌజ్ కే పరిమితమయ్యాడని ఆరోపించారు. ఎన్నికలప్పుడే బయటకొచ్చే కేసీఆర్ లాంటి నాయకుడిని తెలంగాణ సమాజం లీడర్ గా భావించదని అన్నారు. వరదలొస్తే బయటకు రాలేదు.. రైతులు అరిగోస పడుతుంటే రాలేదు.. నిరుద్యోగులు రోడ్డున పడితే రాలేదు.. 6 గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేస్తే రాలేదు.. కానీ కేటీఆర్ బామ్మర్థి రేవ్ పార్టీలో దొరికితే మాత్రం డీజీపీకి ఫోన్ చేస్తాడని అన్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి మీద పడ్డట్లయింది.. ఈసారి అందుకే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా బీజేపీకి ఓటేసి గెలిపించేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ తెలిపారు.