NTV Telugu Site icon

Kamareddy: ప్రైమరీ స్కూల్ లో పైసలా..? ప్రశ్నించిన విద్యార్థి తండ్రిపై టీచర్ భర్త దాడి..!

Kamareddy

Kamareddy

Kamareddy: కామారెడ్డి జిల్లా విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా డబ్బులు డిమాండ్ లు చేస్తుంటే కట్టలేక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లలో ఫీజులు కట్టలేక ప్రైమరీ స్కూల్లో పిల్లలకు చదివించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలనే తల్లిదండ్రుల ఆశలు నీరుగారి పోతున్నాయి. ప్రైమరీ స్కూల్ యాజమాన్యం కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్త ఇప్పుడు కామారెడ్డిలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రశ్నించిన ఓ తండ్రిపై టీచర్ భర్త దాడి చేయడం వైరల్ గా మారింది.

Read also: GHMC Council Meeting: మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు..

కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలం బోమ్మన్ దేవ్ పల్లి ప్రైమరీ స్కూల్ లో సుందర్ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు. అయితే.. ఒక్కక్కరి నుంచి 1500 చొప్పున 4500 చెల్లించాలని టీచర్ పుష్ప అడిగడంతో సుందర్ ప్రశ్నించారు. ప్రైమరీ స్కూల్ లో డబ్బులు ఎందుకు కట్టాలంటూ వాదించాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. సుందర్ మాటలకు టీచర్ పుష్ప స్పందన లేకపోవడంతో.. సుందర్ అధికారులకు ఆశ్రయించాడు. దీంతో టీచర్ పుష్ప భర్త సుందర్ పై కోపం పెంచుకున్నాడు. తన భార్యపై ఎలా అధికారులకు ఫిర్యాదు చేస్తావంటూ సుందర్ ఇంటికి వెళ్లి దాడి చేశాడు. దాడిని ఖండిస్తూ సుందర్ నసూర్లాబాద్ లో రోడ్డు పై బైఠాయించి న్యాయం చేయాలంటూ నిరసన తెలిపాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం.. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి..

Show comments