BJP MLA Katipally: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు ఈ మీటింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ బై పోల్ తో పాటు లోకల్ బాడీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల్లో గెలిచేందుకు తీసుకోవాల్సిన అంశాల తెలంగాణ బీజేపీ రాష్ట్ర రామచంద్రరావు దిశా నిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిథుల మధ్య కో ఆర్డినేషన్ తో పాటు కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లాంటి అంశాలపై చర్చించారు.
Read Also: BB9 : నాలుగో వారం టెనెంట్ నుండి షాకింగ్ ఎలిమినేట్..
ఈ సందర్భంగా బీజేపీ పదాధికారుల సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది.. కనీసం, ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారు కానీ.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది అన్నారు. ఈ సమావేశాలకు రావడం, వెళ్లడమేనా మా పనా?.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవి అని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
