Site icon NTV Telugu

Kamareddy MLA : ఓటేసినందుకు ము* కడగాలంటే కుదరదు.. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు..

Ramanareddy

Ramanareddy

Kamareddy MLA : కామారెడ్డిలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి వివాదస్పదంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ప్రళయం, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఏమీ చేయలేరు” అని వ్యాఖ్యానించారు. “ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఓవర్ కాన్పిడెన్స్ వల్లనే ఈ వరదలలో ప్రజలు చిక్కుకున్నారని” ఆయన తెలిపారు. “వరద తక్కువగా ఉన్నప్పుడు బయటకు వచ్చి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదు” అని ఆయన మరింత వివరణ ఇచ్చారు.

Modi Xi Jinping Meeting: రష్యా, చైనా అధ్యక్షులను కలవనున్న మోడీ.. టియాంజిన్ చేరుకున్న ప్రధాని

ఎంక్రోచ్ మెంట్‌ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. “ప్రజా తప్పిదం, ఎంక్రోచ్ మెంట్ ఈ పరిస్థితికి కారణం,” అని ఆయన స్పష్టం చేశారు. కాగా, సోషల్ మీడియాలో, “అధికారులు, ఎమ్మెల్యే కనపడటం లేదని ఇష్టమొచ్చిన పోస్ట్‌లు పెట్టడం, బాధ్యతాయుతమైన చర్య కాదని” ఆయన చెప్పారు. అంతేకాకుండా.. “ఓటు వేసినందుకు ముడ్డి కడగాలంటే కుదరదు.” “వరదలో అన్ని ప్రాంతాల్లో పర్యటించాను కానీ ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు,” అని రమణా రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను ప్రశంసిస్తూ, “ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కామారెడ్డి చుట్టుపక్కల చెరువులు అలుగు పారాయి, కట్టలు తెగిపోయాయి.

ఈ వర్షం వల్ల ఊహించని నష్టం జరిగినప్పటికీ, అధికార యంత్రాంగం ఫీల్డ్‌లో ఉండి కష్టపడి పనిచేసింది,” అన్నారు. “అధికార యంత్రాంగం పనిచేయలేదు అనటం సరైంది కాదు,” అని ఆయన ప్రకటించారు. సోషల్ మీడియాలో హోరెత్తుతున్న “ఘోరమైన కామెంట్స్” మీద ఆయన స్పందిస్తూ, “విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండాలి, కానీ ఇలాంటి పిచ్చి కామెంట్స్ పెట్టడం సరికాదు” అన్నారు. “వరదల్లో నేను ఏం పనిచేశానో బాధితులకు తెలుసు,” అని ఆయన ఖచ్చితంగా తెలిపారు.

Ambati Rambabu: చంద్రబాబుకు అసలు పోలవరం గురించి ఏమీ తెలియదు.. చర్చకు మేం సిద్ధం!

Exit mobile version