NTV Telugu Site icon

Master Plan: భోగి రోజు భగ్గుమన్న కామారెడ్డి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ముగ్గులతో నిరసన

Kamareddy Master Plan Bhogi

Kamareddy Master Plan Bhogi

Master Plan: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఇంటింటా బోగి మంటలు వేసి కొత్తపనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే భోగి రోజు కామారెడ్డిలో రైతన్నలు భగ్గు మన్నారు. ముగ్గులు వేసి వినూత్న నిరసనలు చేపట్టారు. మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేయాలని కోరుతూ ముగ్గులతో మహిళలు నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ హఠా వో.. కామారెడ్డి బచావో…వ్యవసాయం నిలవాలి, రైతు గెలవాలి అంటూ నినాదాలు చేశారు.

Read also: Pomegranate: రిష్క్‌ లేకుండా ఆ..సమస్యను దూరం చేసే దానిమ్మ

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 5న చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారడం అనివార్యమైంది. ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్య తర్వాత ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. అయితే మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ మాత్రమేనని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. దీంతో వారం రోజుల పాటు ఆందోళనలు వాయిదా పడ్డాయి. మరోవైపు రైతులు తమ నిరసనను ఇంకా కొనసాగిస్తున్నారు. శనివారం భోగి రోజున ఆయన వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఇళ్ల ముందు ముగ్గులు వేశారు.

Read also: Yellow Teeth: ఎంత పసుపు పచ్చని దంతాలైనా.. ఇలా చేస్తే మెరవాల్సిందే..!

తద్వారా వారి విన్నపాలు ప్రభుత్వానికి తెలిసేలా.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలి, అన్నదాత సుఖీభవ, మా భూముల్లో పరిశ్రమలు వేసి మీరేమో ఇండ్లలో పండుగ చేసుకోవడం ఇది మీకు న్యాయమేనా.? అంటూ ముగ్గుల రూపంలో రాసి తమ నిరసనను తెలిపారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు 49 మంది కౌన్సిలర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. అంతే కాకుండా మున్సిపల్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. ప్రస్తుతం ఈ అంశంపై కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ముగ్గురు వ్యక్తులు నిరసనకు దిగారు. సంక్రాంతి రోజు కూడా ఇదే తరహాలో నిరసనలు చేపడతామని రైతు జేఏసీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే..