దానిమ్మ విత్తనాలలాంటి గింజలు అధిక రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపులు వంటి వివిధ వ్యాధులు వచ్చే రిస్క్ లను నియంత్రించటం, తగ్గించటం చేస్తాయి.
ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది దానిమ్మ గింజలు కీళ్లవాతాన్ని, ఆర్థరైటిస్ జబ్బును నయం చేస్తాయి. వీటిల్లో ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గిస్తాయి.
లైంగిక కోరికలను పెంచే సహజపదార్థం. ఈ గింజలు రక్తప్రసరణను పెంచి అంగస్థంభన సమస్యలను నయం చేస్తాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దానిమ్మ గింజలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
క్యాన్సర్ ను నివారిస్తుంది. దానిమ్మ గింజలలో వుండే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కాన్సర్ కణాలు పాకకుండా.. కణాలు చనిపోయేలాగా పురిగొల్పుతాయి.
మధుమేహానికి మంచిది. దానిమ్మ గింజలు డయాబెటిస్ వారికి చాలా ఉపయోగకరం.
వాపులతో పోరాడటంలో సాయపడుతుంది. దానిమ్మ గింజలను తినటం వలన వాపులు మరియు వాపు సంబంధ డిజార్డర్లతో పోరాటంలో సాయం లభిస్తుంది.
పళ్ళను బలపరుస్తుంది. దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపర్చి, వదులుగా మారిన పళ్ళను గట్టిపరుస్తాయి.
జీర్ణశక్తిని పెంచుతుంది. దానిమ్మ గింజలు జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. పీచు పదార్థం జీర్ణప్రక్రియకి ముఖ్యం.
బరువు తగ్గటానికి సాయపడుతుంది. దానిమ్మ గింజలను తినండి, అవి బరువు తగ్గటంలో.. కొవ్వును కరిగించటంలో సాయపడతాయి.
రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. దానిమ్మ గింజలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.