NTV Telugu Site icon

Kamareddy Cyber ​​Fraud: ఆన్‌లైన్‌ కాల్‌ లో కేటుగాళ్ళ ఎంట్రీ.. లక్ష మాయం

Kamareddy

Kamareddy

Kamareddy Cyber ​​Fraud: సైబర్‌ నేరగాళ్లు మితిమీరుతున్నారు. అధికారులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పాసా మాయం చేయడంలో వారి సాటి లేదంటున్నారు. స్కామ్‌ చేయడంలో పైసలు మాయం చేయడంలో మామూలుగా ప్లాన్‌ వేయడం లేదు. వారి వలలో చిక్కడమే ఆలస్యం డబ్బులు అకౌంట్‌ లో వేసుకునేందుకు ఖచ్చినమైన ప్లాన్‌ లతో వేచి చూస్తున్నారు. ఎదుటి వారిని ప్లాన్‌ ప్రకారం కాల్ రావడమే ఆలస్యం అకౌంట్ లో డబ్బులు ఖాలీ చేయడంలో ఆరితేరిపోతున్నారు. దీంతో ఈ సమస్య పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. సైబర్‌ నేరగాళ్లు చేస్తున్న మోసాలకు అధికారులకు సవాల్‌ గా మారింది. సైబర్‌ నేరగాళ్ల చేతిలో అమాయకులు అభాసుపాలవుతున్నారు. మోసపోయి కన్నీరు పెట్టుకుంటున్నారు. సైబర్‌కేటుగాళ్లు మా అకౌంట్‌ ఖాళీ చేసారంటూ పోలీస్టేషన్‌ మెట్లు ఎక్కుతున్నారు. న్యాయం కోసం పోలీసులకు ప్రాధేయపడుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Read also: jewellery Theft: ఇంట్లో పెళ్లి సందడి.. బంగారంతో కి‘లేడీ’ పరార్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సైబర్ మోసం సంచలనంగా మారింది. కామారెడ్డి జిల్లాలో శ్రీనివాస్‌ అనే యువకుడు ఆన్‌ లైన్‌ లో క్లాసుల కోసం అడ్మిసన్‌ తీసుకున్నాడు. మళ్లీ అతను ఎందుకు ఆన్‌ లైన్‌ క్లాసులు వద్దనుకున్నాడు. దీంతో శ్రీనివాస్‌ అడ్మిషన్ రద్దు చేసుకోవడానికి ఆన్ లైన్ లో కాల్ సెంటర్ కు కాల్ చేశాడు. అయితే మాట్లాడుతుండగానే మొబైల్‌ నంబర్‌ కు లింక్‌ లు పంపించారు సైబర్‌ నేరగాళ్లు అది గమనించని శ్రీనివాస్‌ లింకును క్లిక్‌ చేశాడు. అంతేకాకుండా దానికి యూపీఐ నంబర్‌ ను సైబర్‌ కేటుగాళ్లకు చేరవేశాడు. అంతే శ్రీనివాస్ బ్యాంక్ అకౌంట్ నుంచి క్షణాల్లో 95,000 వేల నగదు మాయమైంది. అకౌంట్ నుంచి 95,000 వేలు నగదు డెబిట్ అయినట్లుగా మెసేజ్ రావడంతో శ్రీనివాస్‌ కు దిమ్మతిరిగింది. ఏంచేయాలో అర్థకాలేదు. ఆందోళనకు గురైన శ్రీనివాస్ కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందు నుంచి చెబుతున్నా ప్రజలు వినడం లేదని, ఫోన్లకు మెసేజ్‌ లు వచ్చిన క్లిక్ చేయకండని చెబుతున్నారు. మీ ఏటీఎం పిన్‌ నెంబర్‌, యూపీఐ నెంబర్‌ లు తెలియని వ్యక్తికి పంపకండని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు ఎక్కడి నుంచి పొంచి ఉంటారో చెప్పలేమని ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
HayatNagar Rave Party: ప్రీ ప్లాన్ గా రేవ్ పార్టీ.. పాల్గొన్న మూడు కాలేజ్ ల బీటెక్ విద్యార్థులు