CM Revanth Reddy : తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ, “కమిషన్ నివేదికలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాము. ఈ నివేదికను త్వరలోనే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పార్టీలకు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పిస్తాము,” అని తెలిపారు. ఆయన స్పష్టం చేస్తూ, “ఈ నివేదిక ఎవరిపైనా కక్షసాధింపు కోసం కాదు. ప్రజాహిత దృష్టితోనే ఈ చర్యలు చేపడుతున్నాం,” అన్నారు.
Donald Trump: భారత్‌కు పిడుగులాంటి వార్త! టారిఫ్‌లు మరింత పెంచుతా.. ట్రంప్ హెచ్చరిక!
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ నివేదికపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం ఈ నివేదికను తయారు చేయలేదు. ఇది స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ సమర్పించిన నివేదిక,” అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ప్రజలకు స్పష్టత కల్పించడమే ఈ కమిషన్ ఉద్దేశమని పేర్కొన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో జరిగిన తీరుతెన్నులు ప్రజాధన దుర్వినియోగానికి దారితీశాయి. నిపుణుల విశ్లేషణల ప్రకారం, సుమారు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి, కమిషన్ సూచనల అమలుకు తగిన చర్యలు చేపట్టనుంది.
