Kakatiya Mega Textile Park: కాకతీయ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ ఆరేళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో చీరల తయారీ ప్రారంభమైంది. ఈ పార్క్‌ను చేనేత మరియు జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఈ పార్క్‌ను 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అక్కడ 364కి పైగా పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి. ఈ పార్క్ ద్వారా 5 వేల మంది ప్రత్యక్షంగా మరో 4 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందనున్నారు.
ఓఎన్‌జీసీ భారీ పెట్టుబడి
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్.. సహజ వాయు నిక్షేపాల వెలికితీత కోసం తాజాగా ఆరు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల్లో భాగంగా ఆరు బ్లాకుల్లో 15 వేల 77 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్స్ ఆఫ్‌షోర్ మూడో దశ బిడ్ రౌండ్‌లో ఈ ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఇందులో నాలుగు కాంట్రాక్టులను సొంతగా, రెండు కాంట్రాక్టులను ఇతర సంస్థలతో కలిసి కుదుర్చుకుంది. అరేబియా మహా సముద్రంలోని మూడు బ్లాకులతోపాటు బంగాళాఖాతంలోని మూడు బ్లాకుల్లో వెలికితీత చేపట్టనుంది.
Shepherd Donates Land: ఊరి దాహం తీర్చేందుకు గొర్రెల కాపరి భూరి విరాళం
రూ.5600 కోట్ల ఎఫ్‌పీఐలు
ఫారన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటికి ఇండియన్ ఈక్విటీల్లో దాదాపు 5 వేల 600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోల్చితే మన దేశంలో బెటర్ మ్యాక్రో ఫండమెంటల్స్ ఉండటం దీనికి ఒక కారణం. పండగ సీజన్ నేపథ్యంలో వినియోగదారుల వ్యయం పెరుగుతుందనే అంచనాలు నెలకొనటం మరో కారణం. ఆగస్టు నెలలో అనూహ్యంగా 51 వేల 200 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు జులై నెలలో కూడా సుమారు 5 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఈవారం స్టాక్ మార్కెట్లు శుభారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. గతవారం చివరి వర్కింగ్ డే అయిన శుక్రవారం సెన్సెక్స్ 60 వేల మార్క్‌ను దాటగా శనివారం, ఆదివారం సెలవు అనంతరం వరుసగా రెండో రోజు (అంటే ఇవాళ) కూడా 60 వేల మార్క్ క్రాస్ కావటం విశేషం. సెన్సెక్స్ ప్రస్తుతం 444 పాయింట్లు పెరిగి 60237 వద్ద ఉన్న ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 125 పాయింట్లు లాభపడి 17959 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.59 వద్ద స్థిరంగా ఉంది.